Tuesday, March 16, 2010

విజ్ఞత






.........................................................................కుండలో చిక్కగా తోడుకున్న పెరుగులాంటిది జ్ఞానం. విచక్షణ అనేది చిలికే కవ్వం. కమ్మనైన చిక్కని మజ్జిగగా అప్పుడే రూపాంతరం చెందేది. ఇది నిరంతరమూ సాగాల్సిన క్రియ. ఎదురయ్యే ప్రమాదం, భయం, అమితమైన అలజడి కాలమేఘంలా ఈ క్రియను క్షణకాలం కట్టడి చేస్తాయి. సహజం. ఆ క్షణకాలాన్నీ తన అదుపులో ఉంచుకోగలిగినవారే జ్ఞానమూర్తులు.
విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి అయ్యేందుకు సుదీర్ఘ కాలమే పట్టింది. కోపతాపాలకు గురైనప్పుడు, పంతాలకు పట్టుదలలకు పోయినప్పుడు విచక్షణ కోల్పోవడం వల్లే తపశ్శక్తిని ఎంతో కోల్పోయాడు. ఈ ఉదంతాలు, ఉదాహరణలన్నీ మనకు గీతావాక్యాలు.
సూర్యకిరణ కాంతులు సోకనిదే కమలాలు వికసించవు.
విచక్షణ లేని జ్ఞానమూ భాసిల్లదు.


No comments:

Post a Comment