Wednesday, August 31, 2011

వినాయక చవితి



(Vinayaka Chavithi)
 
''పూవుల్లోన రాజా పూవు.. రోజా పూవు..'' అంటూ పిల్లలు వల్లిస్తుంటారుఅలా పండుగల్లో తలమానికమైన పండుగ అంటే అది ఖచ్చితంగా వినాయక చవితిఇతర ఏ పండుగలు జరుపుకున్నాలేకున్నా ఈ పండుగని మాత్రం అందరూ జరుపుకుంటారుఅది కూడా ఎంతో ఇష్టంగా.  
పొద్దున్న లేస్తూనే స్నానాలూ జపాలూ పూర్తిచేసి పత్రి కోసం బయల్దేరతారుకొండంత దేవుడికి కొండంత పత్రి సమర్పించలేకపోయినా వీలైనన్ని ఎక్కువ రకాల ఆకులుపుష్పాలూ సేకరించి భక్తిగా విఘ్నేశ్వరునికి సమర్పించుకుంటారువినాయక చవితి జరుపుకుంటే చదువుసంధ్యలువృత్తి ఉద్యోగాలు వేటిల్లోనూ ఆటంకం రాదనీఅన్నీ నిర్విఘ్నంగా జరిగిపోతాయని చెప్తారు పెద్దలు.

వినాయక చవితి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం...
 ముందుగా ఇంటిని శుభ్రం చేసుకునికుటుంబసభ్యులంతా తలంటుకోవాలిగుమ్మానికి మామిడాకుల తోరణం కట్టాలివాకిళ్ళను అలంకరించాలిదేవుని గదిలో కడిగిపసుపు రాసిన పీట ఉంచిదానిపై కొన్ని బియ్యం వేసిమనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలితెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో వుంచాలి.
  పాలవెల్లికి పసుపు రాసికుంకుమ బొట్లు పెట్టిదాన్ని విఘ్నేశ్వరుని తలపై వచ్చేలా తాళ్ళు కట్టి మేకుకు తగిలించాలిపాలవెల్లిలో అనేక రకాల ఆకులుపుష్పాలుకాయలు,పండ్లు అందంగా అలంకరించాలి.

వినాయకుడికి ఉండ్రాళ్ళుకుడుములు చాలా ఇష్టంగారెలుపాయసం మొదలైన పిండి వంటలతో బాటు ఉండ్రాళ్ళుకుడుములు తప్పనిసరిగా తయారు చేసుకోవాలివినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొన్ని బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసికొబ్బరికాయ ఉంచికలశాన్ని ఏర్పాటు చేయాలి.
  తర్వాత పసుపు ముద్దతో పసుపు గణపతిని తయారు చేసుకోవాలిపూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్దరిణ వుంచుకుని పక్కన పళ్ళెం పెట్టుకోవాలిపూజ చేస్తున్నప్పుడు చేతికి అంటే పసుపు కుంకుమలను తుడుచుకునేందుకుఒక వస్త్రాన్ని వుంచుకుంటే బాగుంటుంది.
 పూజకు కావలసిన సామగ్రి
పసుపుకుంకుమగంధంఅగరువత్తులుకర్పూరంతమలపాకులువక్కలుపూలుపూల దండలుఅరటిపండ్లు,కొబ్బరికాయలుబెల్లం లేదా పంచదారపంచామృతంతోరందేపారాధన కుందులునెయ్యినూనెదీపారాధన వత్తులువినాయకుడి ప్రతిమ 21 రకాల ఆకులుఉండ్రాళ్ళుకుడుములు,పాయసం.
 వినాయక పూజ
ఆచమ్యః ఓం కేశవాయ స్వాహా  ఓం నారాయణాయ స్వాహా  ఓం మాధవాయ స్వాహా  ఓం గోవిందాయ నమః విష్ణవే నమః  మధుసూదనాయ నమః  త్రివిక్రమాయ నమః  వామనాయ నమః  శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః  పద్మనాభాయ నమః  దామోదరాయ నమః సంకర్షణాయ నమః  వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః  అనిరుద్దాయ నమః  పురుషోత్తమాయ నమః  అధోక్షజాయ నమః  నారసింహాయ నమః అచ్యుతాయ నమః  జనార్ధనాయ నమః  ఉపేంద్రాయ నమః  హరయే నమః  శ్రీకృష్ణాయ నమః
 వినాయక ప్రార్ధన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే త్సరవిఘ్నేపశాంతయే
సముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోధరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరమ్భః స్కన్ద పూరజః
షోడశైతాని నామాని యః పఠేచ్చ్రణుయా దపి,
విద్యారమ్భే వివాహే ఛ ప్రవేశే నిర్గమే తథా
సగ్జ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య సజాయతే.
సభీప్సితార్దద్ధ్యర్ధం పూజితో యస్సురైరపి
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమః
సంకల్పం
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థంశుభేశోభనే మొహుర్తే అద్యబ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే,జంబుద్వీపేభరతవర్షేభతర ఖండే మేరోర్ధక్షిణ దిగ్భాగే (ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి)అస్మిన్ వర్తమాన హ్యావహారిక చంద్రామానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ... (సంవత్సరం పేరు చెప్పాలినామ సంవత్సరే దాక్షిణాయనేవర్షఋతౌభాద్రపదమాసే,శుక్లపక్షే చతుర్ధ్యాం తిథౌ... వాసరయుక్తాయాం,శుభ నక్షత్రశుభయోగశుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాంశుభతిథౌఅస్మాకం క్షేమస్థైర్యవిజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివ్రుద్ధ్యర్ధంధర్మార్ధ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధంఇష్టఅమ్యార్ధంమనోవాంఛఫల సిద్ధ్యర్ధంసమస్త దురితోప శాంత్యర్ధం,సమస్త మంగళావాప్త్యర్ధం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్ధీ ముద్ధిశ్యశ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడసోపచార పూజాం కరిష్యే (నీళ్ళను తాకాలి)
 అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్ధం గణాధిపతి పూజాంకరిష్యేతదంగ కలశపూజాం కరిష్యే కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య తస్సోపరి హస్తం నిధాయ.
 కలశపూజ
కలశం గంధపుష్పాక్షతై రభ్యర్చ్య (కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షతలద్ది లోపల నొక పుష్పము నుంచి తదుపరి ఆ పాత్రను కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రములను చదవాలి.
 కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మ్రతాః
కుక్షౌతు సాగరాః సరే సప్తదీపా వసుంధరా
ఋగ్వేదో విధ యజుర్వేదం సామవేదో హ్యథర్వణః
అంగైశ్చ సహితాః సరే కలశాంబు సమాశ్రితాః
ఆయాస్తు దేవ పూజార్ధం దురితక్షయకారకాః
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధుకావేరీ జలేవి స్మిన్ సన్నిధిం కురు
కలశోదకేన పూజాద్రవ్యాణి దేవమండల మాత్మానం చ సంప్రోక్ష్య.
(కలశమందలి జలమును చేతిలో పోసుకుని,
పూజా వస్తువులపైదేవుని మండపంలోతన తలపై చల్లుకోవాలి)
తదంగతేన వరసిద్ధివినాయక ప్రాణప్రతిష్టావనం కరిష్యే.
ఇప్పుడు వసుపుతో వినాయకుడి తయారు చేసుకోవాలి.
మహా (పసుపుగణాధిపతి పూజ
గణాంత్వాం గణపతిగ్ హవామహే కవింకవీనా ముపమశ్రవస్తామం,
జ్యేష్టరాజం బ్రాహ్మణబ్రహ్మనస్పత్యః ఆనశృణ్వన్నూతిభిస్సీద సాధనం
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యానావాహనాది షోడశోపచార కారిష్యే
(పూలుఅక్షతలు కలపాలి)
 శ్రీ మహాగణాధిపతి స్సుప్రసన్నోసుప్రీతోవరదోభవతు
శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసాగృహ్ణమి
(రెండు అక్షతలు తలపై వేసుకోవాలి)
అథ శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపానం కరిష్యే
 ప్రాణ ప్రతిష్ట
మం!! అసునీతే పునరాస్మాసు చక్షు:
పునః ప్రాణ మిహనో ధేహి భోగమ్,
జ్యోక్పశ్యేషు సూర్య ముచ్చరంత
మనుమతే మ్పడయాన సస్తి.
అమృతం వై ప్రాణా అమృత మాపః ప్రాణానేవ యథాస్థాన ముపహయతే.
స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్!
తావత్వం ప్రీతిభావేన బిందేస్మిన్ సన్నిధిం కురు!!
ఆవాహితో భవస్థాపితో భవసుప్రసన్నోభవవరదో భవ
అవకుంఠితో భవస్థిరాసనం కురుప్రసీద ప్రసీద.
పూజా విధానం
శ్లోభవసంచితపాపౌఘవిధ్వంసవిచక్షణం!
విఘ్నాంధకారభాసంతం విఘ్నరాజ మహం భజే!!
ఏకదస్తం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం!
పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ధివినాయకమ్!!
ఉత్తమం గణానాథస్యవ్రతం సంపత్కరం శుభం!
భక్తాభీష్టప్రదం తస్మాద్ద్యాయే త్వం విఘ్ననాయకమ్!!
ధ్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం!
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్!!
శ్రీ వరసిద్ధివినాయకం ధ్యాయామి.
 అత్రా విగచ్చ జగదంద్య సురరాజార్చి తేశ్వర!
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ!!
శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి.
 మౌక్తికైః పుష్పరాగైశ్చ నానార త్నై ర్విరాజితం!
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్!!
శ్రీ వరసిద్ధి వినాయకం ఆసనం సమర్పయామి
గౌరీపుత్రసమస్తేస్తు శంకర ప్రియనందన!
గ్రహాణార్ఘ్య మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం!
శ్రీ వరసిద్ధివినాయకాయ అర్ఘ్యం సమర్పయామి
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక!
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ దిరదాసన!
శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి
అనాథనాథ సరజ్ఞ గీర్వాణవరపూజిత!
గృహాణచమనం దేవతుభ్యం దత్తం మయా ప్రభో
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి.
దధిక్షీరసమాయుక్తం మధాహ్హ్యేన సమన్వితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర సమోస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి
స్నానం పంచామృతై ర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథసర్వజ్ఞ గీర్వాణగణపూజిత
శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృతస్నానం సమర్పయామి.
గంగానది సర్వతీర్ధ్యేభ్య ఆహృతై రమలైర్జలై:
స్నానం కురుష భగవ స్నుమాపుత్త్ర సమోస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయాకం శోద్దోదక స్నానం కారయామి
రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానా మిష్టదాయక
వరసిద్ధివినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి
 చందనాగురుకర్పూరకస్తూరీకుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్టప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్
శ్రీ వరసిద్ధి వినాయకం గంధం ధారయామి.
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే
శ్రీ వరసిద్ధివినాయకాయ అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి.
సుగన్ధాని చ పుష్పాణి జాజీకుందముఖానిచ
ఏకవింశతిపత్రాణి సంగ్రహాణ నమోస్తుతే

గణనాయకుని పూజ
గణేశాయ నమః పాదౌపూజయామి!!
ఏకదంతాయ నమః గులౌపూజయామి!!
శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి!!
విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి!!]
అఖువాహనాయ నమః ఊరూ పూజయామి!!
హేరంబాయ నమః కటిం పూజయామి!!
లంబోదరాయ నమః కటిం పూజయామి!!
గణనాథాయ నమః హృదయం పూజయామి!!
స్థూలకంఠాయ నమః స్కంధౌ పూజయామి!!
పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి!!
గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి!!
విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి!!
శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి!!
ఫాలచంద్రయ నమః లలాటం పూజయామి!!
సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి!!
విఘ్నరాజాయ నమః సర్వాంగాని పూజయామి!!
ఇప్పుడు వినాయకుని ఆవిర్భావంశమంతకమణి కథ చదువుకుని తలపై అక్షతలు జల్లుకోవాలి.
ప్రదక్షిణలుసాష్టాంగ నమస్కారం పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకుంటే సరిపోతుంది.
 పార్వతీ నందనా నీకు వందనం!

వినాయక చవితి పండుగ వంటలు


కొబ్బరి శనగపప్పు పాయసం
కావలసిన పదార్థాలు
పాలు - ఒక లీటరు
శనగపప్పు - 1 కప్పు
కొబ్బరి పాలు - 2 కప్పులు
బొంబాయి రవ్వ - 1/4 కప్పు
బెల్లం - ఒకటిన్నర కప్పు
ఇలాచీలు - 2
నెయ్యి - 1 టేబుల్ స్పూను
జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ - తగినన్ని
తయారు చేసే పద్ధతి
కుక్కర్‌లో శనగపప్పు, రెండు కప్పుల నీరు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచితే పప్పు మెత్తగా ఉడుకుతుంది. విడిగా బెల్లంలో కొద్దిగా నీరుపోసి కరిగించి పెట్టుకోవాలి. ఉడికించిన శనగపప్పులో ముందుగా బొంబాయి రవ్వ(నీళ్లలో కలుపుకుని), తర్వాత బెల్లం పాకం, చివర్న కొబ్బరిపాలు పోసి కాసేపు ఉడకనివ్వాలి. దించే ముందు ఇలాచీ పొడి, నేతిలో వేయించిన డ్రైఫ్రూట్స్ వేయాలి.

కోవా కజ్జికాయ
కావలసిన పదార్థాలు
మైదాపిండి – అరకిలో
పంచదార – కిలో
పాలకోవా - పావుకిలో
జాపత్రి - 2 గ్రాములు
యాలకులు – 2 గ్రాములు
శనగపిండి – 50 గ్రాములు
వంట సోడా - పావు స్పూను
బేకింగ్ పౌడర్ – పావుస్పూను
నెయ్యి – 100 గ్రాములు
రిఫైన్డ్ ఆయిల్ - తగినంత
తయారు చేసే పద్ధతి
ఇండియన్ స్వీట్లలో కోవా కజ్జికాయ విశిష్టమైంది. కజ్జికాయ ఇష్టపడనివారు దాదాపుగా ఉండరు. కజ్జికాయ అనేక వెరైటీల్లో కోవా కజ్జికాయ రెసిపీ ఒకటి. రుచికరమైన కోవా కజ్జికాయ రెసిపీ తెలుసుకుందాం. ముందుగా శనగపిండిలో కోవా కలిపి కొంచెం వేయించి దించాలి. దానిలో జాపత్రిపొడి, యాలకులపొడి, కొంచెం పంచదార కలిపి ముద్దగా చేయాలి. బాణలిలో మిగిలిన పంచదార పోసి, 2 గ్లాసులు నీళ్ళు పోసి లేత పాకం వచ్చేవరకూ ఉంచి దించాలి. మైదాపిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి. అందులో కరగబెట్టిన నెయ్యి కలిపి నీళ్ళు చేర్చి గట్టి ముద్దలా చేయాలి. నిమ్మకాయంత ముద్దలను తీసుకుని పూరీలా, కొంచెం మందంగా ఒత్తి మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి, అంచులను తడిచేసి, కోవాకు దగ్గరగా చుట్టి కజ్జికాయలు చేయాలి. వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి, పంచదార పాకంలో వేసి ముంచి తీస్తే సరి, నోరూరించే కోవా కజ్జికాయలు సిద్దం!

కొబ్బరి వడలు
కావలసిన పదార్థాలు
కొబ్బరికాయ – 1
బియ్యం – పావుకిలో
నూనె – పావుకిలో
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి - 6
కొత్తిమీర – 1 కట్ట
జీలకర్ర – 1 టీ స్పూను
వంట సోడా – చిటికెడు
కరివేపాకు – 2 రెబ్బలు
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి
కొబ్బరిని తురమాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. బియ్యం కడిగి నానబెట్టాలి. నీళ్ళు ఓడ్చి, కొబ్బరి తురుము కలిపి రుబ్బుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి నూరి కలపాలి. వంటసోడా, ఉప్పు, తరిగిన కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. బాణలిలో నూనె కాగనిచ్చి కలిపి ఉంచుకున్న పిండిని వడల్లా వత్తి ఎర్రగా వేయించుకోవాలి. కొబ్బరి వడలు క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి.

వినాయక పూజలో పత్రి ఎందుకు?



(Vinayaka Pooja Benefits of Patri)
తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా జరిగేందుకు తొలి పూజ చేసేది వినాయకుడికేఅలాగే దక్షిణాయనంలో మనం జరుపుకునే పండుగలలో మొదటిది వినాయక చవితిఇక ఆ తర్వాత ప్రతినెలలోనూ ఏదో ఒక పండుగ మనల్ని పలకరిస్తుందిసంతోషాన్ని అందిస్తుంది.
దేవతలలో విఘ్నాధిపతి లంబోదరుడుగణపతి సిద్ధి,బుద్ధి ప్రదాతగణేషుని ఆకృతి ఆధ్యాత్మికంగా చూస్తే అనేక కొత్త అర్ధాలు చెబుతుందిఆ ఆకృతిలోని అంతరార్థము తెలుస్తుందిగజాసుర సంహారం,వినాయకుని జన్మ వృత్తాంతం మనకు తెలుసు.మనకు తెలియనిదల్లా ఆయనకు చేసే పూజ గురించే.వినాయకుడు పత్రి ప్రియుడుపత్రితో మనం చేసే పూజ ఆయన అనుగ్రహాన్ని కలిగిస్తుందిఏనుగు తినే ఆహారమే పత్రి అనివినాయకునికి ఏనుగు తల ఉంది కాబట్టి ఆకులుపూవులతో కూడిన పత్రిని నైవేద్యంగానోపూజా ద్రవ్యంగానో సమర్పిస్తున్నామని చాలామంది అనుకుంటుంటారుకానీ అది నిజం కాదుమరి పత్రివల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
వినాయకుని పూజకు మనం వాడే పత్రిలో ఆకులుకాయలుపూలుపండ్లు ఉన్నాయివీటిలో ఎనలేని ఔషధ గుణాలున్నాయి.కేవలం స్పర్శామాత్రంతో కొన్ని రకాల అతి సామాన్య వ్యాధులను నయం చేయగల శక్తి వీటికి ఉందికొన్ని రకాల ఆకులు గదిలో ఒక విధమైన పరిమళాన్నిస్తూ ఆరోగ్యకరమైన ప్రాణవాయువును అందిస్తాయిమన పూర్వీకులకు వీటి గుణాలు తెలుసుఆ ఔషధాలన్నింటినీ నట్టింటికి రప్పించేందుకు చేసిన ప్రయత్నమే ఈ పూజ అని గుర్తించాలిఏదో సంవత్సరానికి ఓసారి ఇలా పూజ కోసం ఆ ఔషధ గుణాలున్న పత్రిని ఇంటికి తీసుకువస్తే సరిపోతుందాఆరోగ్యం చేకూరిపోతుందాఅనే సందేహం రావడం సహజం.నిజం చెప్పాలంటే ఒకసారి చేసినంతలో పెద్దగా ప్రయోజనం ఉండదుకాకపొతే ప్రతిరోజూ ఇన్ని నియమాలతో పూజ చేయడం కష్టం కాబట్టి ఆ ఏర్పాటు చేశారు.
భాద్రపద మాసంలోనే పత్రితో పూజ ఎందుకు చేయాలిఎప్పుడో ఒక్కప్పుడు చేస్తే సరిపోతుందాఅని మరో ప్రశ్న కలగొచ్చుదానికి సమాధానం ఏమిటంటే... ఇతర సందర్భాల సంగతి అలా ఉంచి భాద్రపద మాసంలో తప్పక చేయాలిఎందుకంటే.. భాద్రపదమాసంలో వానలు పడుతూఎక్కడికక్కడ చిత్తడిగాబురదగా ఉంటుందిగుంటల్లో నీళ్ళు నిలిచి సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందిఇలాంటి సమయంలో వినాయకునికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడంవల్ల ఇంట్లో వాతావరణం బాగుండి,సూక్ష్మ క్రిములను నశింపజేస్తుంది.
గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీఈ తొమ్మిది రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉందికొన్నిచోట్ల రానురాను మరుగున పడుతోందికొందరు పూజ ముగిసిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని తొలగించినప్పటికీ పత్రిని మాత్రం కనీసం తొమ్మిది రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారుఅంటేపదిరోజులపాటు మనం ఔషధ గుణాలున్న పత్రి నుండి వచ్చే గాలిని పీలుస్తాం.
తొమ్మిది రోజుల తర్వాత సమీపంలోని నదిలోనోచెరువులోనో నిమజ్జనం చేయడం వల్ల కూడా లాభమే చేకూరుతుందిపత్రిలోని ఔషదగుణాలలో కొన్నయినా ఆ నీటిలో చేరతాయిఆ రకంగా అవి నీటిలోని క్రిములను నశింపజేస్తాయిఆ నీటిని తాగినప్పుడు అనారోగ్యాలు కలగవు.
తొమ్మిది రోజులు జరిపే పూజ వల్ల ఆరోగ్యపరంగా సత్ఫలితం కలుగుతుందని నమ్మటం మూఢనమ్మకం కాదుశాస్త్రీయంగా ఇది నిజమేవినాయక వ్రతం ఆచారం వెనుక ఉన్న ఆయుర్వేద పరమైన కారణం ఇదివినాయకుని పూజించే పత్రిలో ప్రధానంగా ఉండాల్సినవి గరికతులసినేరేడుమారేడుమరువంఉమ్మెత్తఉత్తరేణి తదితర ఔషధ గుణాలున్న పత్రాలువీటివల్ల ఎలాంటి ఉపయోగం కలుగుతుందో తెలుసుకుందాం.
తులసి
తులసివల్ల జరిగే మేలు గురించి ఏకంగా ఒక పుస్తకమే రాయొచ్చుకఫం మొదలైన అనేక రోగాలను తగ్గిస్తుంది.
జిల్లేడు
చర్మ వ్యాధులనుశ్వాసకోశ వ్యాధులను జిల్లేడు నశింపచేస్తుందినరాలకు సత్తువనిస్తుందిజిల్లేడు ఆకులనుండి వచ్చే మొత్తం శరీరంలోని దోషాలను నివారిస్తుందిశరీరానికి ఆరోగ్యం కలిగిస్తుంది.
రేగు
అతిసారంరక్తదోషాలను మటుమాయం చేస్తుందికేశ వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుందిరేగు ఆకులనే ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి.
మరువం
మరువపు పరిమితం వాతావరణాన్ని ఆహ్లాదంతో నింపుతుంది.శ్వాసచెవి సమస్యలు తగ్గుతాయి.
రావి
రావి ఆకులు మానసును కేంద్రీకరించేందుకు తోడ్పడతాయి.
దానిమ్మ
దానిమ్మ పూలుబెరడుకాయలను ఆయుర్వేదంలో ఔషధాలుగా ఉపయోగిస్తుంటారువర్షాకాలంలో వచ్చే నీళ్ళ విరోచనాలవంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఉత్తరేణి
ఉత్తరేణి వేరును మొహం కడుక్కోవడానికి ఉపయోగిస్తుంటారుఉత్తరేణి అత్యుత్తమ ఔషధ గుణాలు కలిగి ఉందని నిర్ధారించారు.
బిల్వపత్రం
సూక్ష్మక్రిములను హరిస్తుందిచర్మవ్యాధులను నివారిస్తుందిగాలి చొరని గర్భగుడుల్లో బిల్వపత్రాలతో పూజించడంవల్ల స్వచ్చత చోటు చేసుకుంటుంది.
నేరేడు
నేరేడు కాయ అతి మూత్ర వ్యాధిని తగ్గిస్తుందినేరేడు ఆకుల నుంచి వీచే గాలి ఆరోగ్యానికి మంచిది.
మారేడు
త్రిదోషాలను హరిస్తుందిసకల దోషాలను హరిస్తుంది.
గరిక
ముక్కు సంబంధమైన అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.
మాచీ పత్రి
వ్రణాలుదద్దుర్లువాత రోగాలు,నులిపురుగులను తగ్గిస్తుందికొన్ని రకాల జ్వరాలను కూడా ఇది తగ్గించగలదుఅతి దాహాన్ని హరిస్తుంది.
జమ్మి
ఈ పేరు వినగానే మనకు గుర్తు వచ్చేది దసరా పండుగశమీ పూజ చేస్తాం కదాకఫశ్వాస రోగాలను తగ్గించడంలో జమ్మి చెట్టు ఆకులు,బెరడు బాగా పనిచేస్తాయి.
మునగాకు
కఫాన్నివాతాన్ని హరించి శ్వాసను క్రమబద్ధం చేస్తుంది.
ఇలా చెప్పుకుంటూపొతే ఒక్కో మొక్కదీ ఒక్కో ప్రత్యేకతవినాయకుని నిత్యం అర్చిస్తుంటే శుభాలు తప్పక కలుగుతాయినవరాత్రులలో చేసిన విధంగా కాకుండా ప్రతిరోజూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు స్మరిస్తే మంచి కలుగుతుంది.మనం కోరే ఫలితాన్ని బట్టి వినాయకుని ప్రతిమను ఏర్పరచుకోవాలని కూడా పెద్దలు చెప్పారు.
గణపతి బంగారు ప్రతిమను పూజిస్తే ఐశ్వర్యంవెండి ప్రతిమను పూజిస్తే ఆయుష్షురాగి ప్రతిమను పూజిస్తే సంకల్ప సిద్ధి కలుగుతాయివినాయక వ్రతం ఎప్పుడు శుభకరమేగణేశ చతుర్థి రోజు ఈ వ్రతం ఆచరిస్తే చదువులో వెనుకబాటు ఉండదువృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి ఆటంకాలూ ఉండవుఅందరూ కలిసి చేసుకునే పర్వదినాల్లో వినాయక చవితి ముఖ్యమైందిఇలాంటి పండుగలవల్ల వ్యక్తిగతంగా ప్రశాంతత చేకూరడమే కాకుండా ఐకమత్యం పెరిగి సమాజానికి మేలు జరుగుతుంది.

Mythology of Ganesh Chaturthi



Ganeshji giving Ashirwad
Mythology
Centuries ago
during a war between the Gods and the Demons, Lord Shiva was away for
a long time. His wife, Goddess Parvati, afraid of being alone for an extended
period used her divine powers and created a son, Ganesh, and gave him
the responsibility of protecting the house. When Lord Shiva and his army,
returned victorious to his home, Parvati was in her bath, and Ganesh had
been strictly instructed not to allow anyone in. Angered by Ganesh’s refusal
to allow him in to the house, Lord Shiva and his army chopped off the
boy’s head. When Parvati came out of her bath, she was shocked and grieved
to see her son dead. Lord Shiva, to pacify, her proclaimed that the head
of Ganesh would be replaced by that of the first creature that came up
the hill. As luck would have it the first visitor to the hill was an elephant
and his head was promptly cut off and placed on that of Lord Ganesh, and
life was restored to the son of Lord Shiva and goddess Parvati. To pacify
his wife further and compensate for the act of killings own son, Lord Shiva
bestowed upon Ganesh the powers of a God and blessed him that henceforth
no activity will begin without invoking your name and blessings. Since
then, it is said, no new venture - the inauguration of accompany, the
opening of a shop, the foundation of a building, entering a new home -
is deemed complete by Hindus without a Ganesh puja.
Ancient Hindu
texts are filled with tales about Lord Ganesh, his powers, wisdom and
goodness, one of the most delightful being the one about a contest between
him and his brother, Kartikeya. Kartikeya was very proud of his mount,
the peacock, and his own speed and efficiency, challenged lord Ganesh
to a race around the world 7 times. While Kartikeya made a tour of the
world thrice, Ganesh just encircled lord Shiva and goddess Parvati, his
parents 7 times, and claimed victory. The story is often related to inculcate
in children the importance of God and their parents.

EID KE KHOSHiYAN BAHOT BAHOT MUBARAK


SAB KO 
EID KE  KHOSHiYAN  BAHOT  BAHOT  
MUBARAK
Click to join me @ Surat_tulips
Eid Mubarak to all of you. May this eid day will be full of colours and
rich of pleasures of all kinds for everyone of you

!!! Ameen !!!
 

Wish you a very happy and peacefullEid.
‘Eid Mubarak’
May god bless all of us