ఒక రాజుగారికి నలుగురు భార్యలు....
నాలగవభార్య అంటే ఎంతో ముద్దు అందుకే ఆవిడని వస్త్రవైఢూర్యాలతో మురిపించేవాడు.
మూడవ భార్యని కూడా మురిపంగానే చూసుకునేవాడు, ఆవిడని ఒంటిస్తంభం మేడలోవుంచి ఎప్పుడూ ఒక కన్నేసి వుంచేవాడు ఆవిడ తనని వదిలి సామంతరాజులతో వెళ్ళిపోతుందేమోనని భయం.
రెండవభార్య అంటే అమితమైన అభిమానం, ఆవిడ రాజుగారికి అన్నివిధాల సహాయం చేసే శాంతమూర్తి మరియు సలహాదారిణిగా వ్యవహరించేది.
మొదటి భార్య గురించి చెప్పాలంటే, ఆవిడ పట్టపురాణి. రాజుగారికి చేదోడువాదోడుగా ఉంటూ, ఆయన ఆలనాపాలనా చూసుకునేది. కాని రాజుగారు ఆవిడని పట్టించుకునేవారుకాదు, అది కనపడకుండా గాంభీర్యం అనే ముసుగువేసుకుని ఆవిడతో గడిపేవారు.
ఇలా జరుగుతుండగా కొన్నాళ్ళకి.....
రాజుగారికి అనారోగ్య కారణంగా ఆయనలో మృత్యుభయం చోటు చేసుకుంది.
నాలగవభార్యని పిలచి నిన్ను నేను అమితంగా ప్రేమించాను నాతో పాటు మృత్యువులో తోడుంటావా అని అడిగితే లేదు అని ఆవిడ చెప్పిన సమాధానం రాజుగారి గుండెలో బాకులాదిగింది.
మూడవభార్యాని తోడు రమ్మంటే...నేను రాలేను నా జీవితం ఎంతో మధురమైనది మీరు మరణించిన పిదప నేను వేరొకరిని వివాహమాడుతానన్న మాటలకి రాజుగారు కృంగిపోయారు.
రెండవభార్యతో నీవైనా నా వెంట వస్తావా, నాకు ఇన్నాళ్ళు అన్నింటిలో సహాయ, సలహాలనిచ్చావుగా చరమాంకంలో కలసి పయనించమని వేడుకున్నాడు. దానికి ఆవిడ మీతో కలసి రాలేను కాని కడవరకు మిమ్మల్ని సాగనంపుతానంది.
"నేను వస్తాను మహారాజా మీవెంట మీరు ఎటువెళితే అటు"... అంటూ మొదటిభార్యగొంతు నిస్తేజంగా కృంగిపోతున్న మహారాజవారికి వినిపించింది. అప్పుడు చూసారు నీరసంతో క్షీణించిన మహారాణిగారి వంక, మనసుని నులిపెట్టే భాధతో అనుకున్నారు అయ్యో! నేను ఇంతకాలం ఈవిడనా నిర్లక్ష్యం చేసింది, తనని శ్రద్దగా చూసుకోలేక పోయానని అప్పుడు పశ్చాతాప పడ్డారు.
మనజీవితంలో ఆ నలుగురు.....
నాల్గవభార్య మన శరీరం:- మన శరీరాన్ని యవ్వనంలో ఎంతో మోహించి, శ్రద్దవహించి, ఎంతో సమయాన్ని వెచ్చించినా సమయానికి అది మనతో సహకరించదు.
మూడవభార్య మన అధికారం ఆడంబరం:-మనల్ని మృత్యువులో వీడి వేరొకరికి సొంతమౌతాయి.
రెండవభార్య సంసారం సంతానం:-ఎంతమనకి సహాయంచేసి సహకరించి సలహాలిచ్చినా వారు సాగనంపటానికే కాని సాంతం మనతోరారు.మొదటిభార్య మన ఆత్మ:- ఆడంబరాలకి, ఐశ్వర్యార్జనకు, పేరు ప్రతిష్ఠలకై మనం ఆత్మని ఎంత అశ్రద్ద చేసినా కడవరకు తోడుంటుంది.

Out standing and Mind Blowing..... chaala baundi
ReplyDeletehats-of for ur efforts for giving such a old moral story in telugu script.