Wednesday, December 23, 2009

ఫన్‌కర్‌ ఫటాఫట్‌


* హనుమంతుణ్ని నరకాసురుడి దగ్గరికి పంపితే ఏం చేసేవాడు?
చూసి రమ్మంటే 'పేల్చి' వచ్చేవాడు.

* సత్యభామ నరకాసురుడిని వధించకపోతే టపాకాయల పరిశ్రమ ఏమయ్యేది?
'కృష్ణా'ర్పణమయ్యేది. అప్పుడు ఆయనే ఢామ్మని నరకాసురుణ్ని ఒక చూపు చూసేవాడు.

* అందమైన అమ్మాయి కదా అని అప్పిచ్చాను. కనీసం వడ్డీ కూడా ఇవ్వడం లేదు ఎందుకు?
మీ 'అసలు' దృష్టి తెలిసాక వడ్డీ మాత్రం ఎందుకిస్తుంది?

* నాది పాప్‌కార్న్‌ బిజినెస్‌. దానికి 'ఫటాఫట్‌ కరాకర్‌' అని పేరు పెడదామనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరమా?
మీరు ఆ పని చేస్తే నేనెందుకు ఊరుకుంటాను. పనిగట్టుకుని వచ్చి కరకరా నమిలేస్తాను(మిమ్మల్ని కాదులెండి, పాప్‌కార్న్‌ను).

* మీ చూపు కూడా సెన్‌'సెక్స్‌' మీదేనా?
మీ సెన్‌'సెక్స్‌' పరిజ్ఞానానికి నా జోహార్లు. కాని, దాని మీదే అతిగా ఆధారపడితే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త!

* నేనూ 'ఫ్రెష్‌'లు పెట్టి లక్షలు సంపాదిద్దామనుకుంటున్నా సాధ్యమవుతుందా?
'ఫ్రెష్‌' మైండ్‌తో చేస్తే సాధ్యంకానిది ఏముంటుంది?

* ఇన్సూరెన్స్‌ బిజినెస్‌లో ఎప్పుడూ బిజీగా ఉండాలంటే?
యమధర్మరాజు 'బిజినెస్‌' బాగుండాలి.

* మీరూ, నేనూ జాయింట్‌ వ్యాపారం చేద్దాం రెడీనా?
నా 'జాయింట్స్‌' ఏమవుతాయోనన్నదే నా బెంగంతా

* 'సత్యం' రామలింగరాజును అమెరికాలో సెటిల్‌ అవమంటూ బిల్‌గేట్స్‌ ఆహ్వానం పంపాడట. అలాకాక బిల్‌గేట్స్‌నే ఇండియా వచ్చేయమంటే...
'గేట్స్‌' ఎక్కడుంటేనేం నాయనా! అమెరికా బిల్లులన్నీ మనవే అవుతాయి. ఇండియా గేట్‌ను ఇండియా 'గేట్స్‌'గా మార్చుకుంటే సరి!

* కుబేరుడ్ని కావాలంటే...?
(కు)బేరసారాలు బాగా తెలిసి ఉండాలి.

* కూరగాయల ధరలు బాగా తగ్గాలంటే?
'ఫల'హారాలు మాత్రమే చేయాలి.
(Eenadu, 04:11:2007)
__________________

No comments:

Post a Comment