Saturday, December 26, 2009

ఫన్‌కర్‌ ఫటాఫట్‌




* నేను ఒక అమ్మాయిని ప్రేమించే పెళ్లి చేసుకున్నా. అయినా ఇద్దరి ఐడియాలూ కలవడం లేదు. ఇదో పెద్ద సమస్య అయిపోయింది. పరిష్కారం చెప్పి పుణ్యం కట్టుకోండి.

అదేం పెద్ద సమస్య? ఇద్దరి సెల్‌ఫోన్లకూ ఐడియా కనెక్షన్లు తీసుకోండి. ఐడియాలు అవే కలుస్తాయి.
________________________________
* ఎంసెట్‌లాగా బీసెట్‌ పెట్టి అందులో ఉత్తీర్ణులైన వాళ్లనే వ్యాపారం చేయడానికి అనుమతిస్తే?

ఉత్తీర్ణులైన వాళ్లు ఏం'సెట్టు'లే హలా అంటారు. కానివాళ్లు 'ఎంట్రన్సు'లోనే ఆగిపోయి ఎంత'సెట్టు'కు అంత 'ధూళి' అని పాడుకోవాల్సిందే.
________________________________
*స్టాక్‌తత్వం ఒక్కముక్కలో చెప్పండి?

అంతా 'జోక్‌'!
________________________________
* బడా పారిశ్రామికవేత్తకైనా, రాజకీయ నాయకుడికైనా అవసరమైనవి?

'కోట్లు...' వరించడానికైనా, ధరించడానికైనా.
________________________________
* రామాయణంలోనూ, భారతంలోనూ వ్యాపారం ఉందా?

అప్పుడుందో, లేదో తెలీదు గాని, ఇప్పుడు మాత్రం రామాయణం మీద, భారతం మీద బోలెడంత వ్యాపారం జరుగుతోంది.
________________________________
* కల నిజం కావాలంటే ఏంచేయాలి?

పగలు నిద్రపోకుండా ఉంటే సరి.
________________________________
* కచ్చితంగా మరో జన్మ ఉండాలంటే ఏంచేయాలి?

ఇచ్చినవాడి దగ్గరల్లా అప్పులు చేసేయాలి. రుణాలు తీర్చుకోవడానికైనా వాడు మళ్లీ పుట్టాలని అప్పులవాళ్లు సామూహిక ప్రార్థనలు చేస్తారు.
_______________________________
*మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్లింది. దాని ప్రభావం ఏమైనా ఉంటుందా?

బహుశా స్టాక్‌ మార్కెట్‌ పడిపోవచ్చు (ఈమధ్య ఎక్కడేం జరిగినా పడిపోతున్నది షేర్ల ధరలే కదా!)
_______________________________
* లక్షకారు లక్షణంగా ఉంటుందంటారా?

కొనేవాడు కోటీశ్వరుడైతే!
_____________________________

No comments:

Post a Comment