Wednesday, December 23, 2009

ఫన్‌కర్‌ ఫటాఫట్‌


రాజకీయాలకు వ్యాపార ప్రతిపత్తి లభిస్తే?
లైసెన్సు అవసరం లేదు. 'లైయింగ్‌ సెన్సు' ఉంటే చాలు.
-------------------------
సినీ నటుల్లాగా పారిశ్రామికవేత్తలతో క్రికెట్‌ ఏర్పాటు చేస్తే?
విజయానికి ఎవరి 'ఇండస్ట్రీ' మీద వారు ఆధారపడతారు.
---------------------------
ప్రపంచబ్యాంకు తల తాకట్టు పెట్టించుకుంటుందా?
'నేతల తాకట్టు' పెట్టించుకుంటుంది.
------------------------------
రేపటికల్లా నేను మిట్టల్‌ను అయిపోవాలంటే?
తక్షణం వ్యాపారంలోని మిట్ట(ల్‌) పల్లాలు ఔపోసన పట్టడమే.
----------------------------------
ఎంత పెద్ద కుంభకోణాలు బయల్పడినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవు ఎందుకని?
'స్కామాయణం'లో 'పీడకల వేట' ఎందుకని.
-------------------------------------
ఆర్థికమంత్రి చిదంబరం మీ దగ్గరకొచ్చి బ్లాక్‌మనీని వెలికితీసే చిట్కా చెప్పమంటే ఏం చెబుతారు?
ముందు వైట్‌మనీనంతా 'బ్లాక్‌' చేసేయమంటాను.
-------------------------------------
రోబోలు పాఠాలు చెబితే..
అన్నీ 'మెకానికల్‌'గా ఉంటాయి.
--------------------------------------
సెన్సెక్స్‌ బాగా పెరిగిపోతోంది కదా! అయినా పేదవాళ్ల సంఖ్య తగ్గడం లేదెందుకు?
ఉన్నదాన్ని అందరూ 'షేర్‌' చేసుకోకపోవడం వల్లే.
--------------------------------------
నాకు 65 ఏళ్లు. రానురాను ఓపిక తగ్గుతోంది. అయినా బతకడానికి ఏదో ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నారు. నేను బార్‌ పెడితే మేలా? రెస్టారెంట్‌ మేలా?
రెస్టారెంట్‌ పెడితేనే మేలు. ఏజ్‌'బార్‌' అవుతుంది గానీ రెస్టారెంట్‌ అవ్వదు కదా!
----------------------------------------
లెక్కల టీచర్లంటే పిల్లలు ఎందుకు భయపడతారు?
వాళ్లవల్ల బోలెడన్ని 'ప్రాబ్లమ్స్‌' కాబట్టి.
-----------------------------------------
పశువులకు కూడా 'మధ్యాహ్న గడ్డి పథకం' ప్రవేశపెట్టవచ్చు కదా!
ఓట్లు లేని ఆ మూగజీవులను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? అయినా పశువులకు శ్రమ లేకుండా గడ్డితినే మహానుభావులు బోలెడంత మంది ఉన్నారు కదా.
-----------------------------------------


ఏదైనా పార్టీ కిలో రెండ్రూపాయల బియ్యం పథకంలా కిలో రెండ్రూపాయల ఉల్లి పథకం ప్రవేశపెడితే?
రాజకీయం ఢిల్లీ చుట్టూ కాకుండా ఉల్లి చుట్టూ తిరుగుతుంది. 'ఉల్లీ' నిన్ను దలంచి...' అనేది అన్ని పార్టీల ప్రార్థనాగీతం అవుతుంది.

-------------------------------------------
(Eenadu, 18:11:2007)

No comments:

Post a Comment