Friday, December 18, 2009

ఒక్క నిమిషం!


మీసంపాదనెంత?నెలకి ఎంతని కాదు, అలాని వారానికీ రోజుకీ గంటకీ ఏమాత్రమనీ అడగట్లేదు. నిమిషానికెంతా అన్నది ప్రశ్న.
'ఆదాయాన్ని 30తో భాగించి, దాన్ని 24తో, మళ్లీ దాన్ని...'
హలో... మీ లెక్కల్ని కాసేపు పక్కనబెట్టండి.ఇప్పుడు చెప్పబోయేది
మన సంపాదనల సంగతికాదు, పెద్దపెద్ద వాళ్ల గురించి. వృత్తిద్వారా
కొందరు కోట్లు గడిస్తే వ్యాపారప్రకటనల ఆదాయం మరికొందరికి అదనం.
అలాంటి ప్రముఖ వ్యాపారవేత్తలూ క్రికెటర్లూ సినీతారలూ రాజకీయ నాయకుల సంపాదన నిమిషానికి(సుమారుగా) ఎంతో చూద్దామా!
బిల్‌గేట్స్‌
మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌
ఆదాయం: రూ.2.7 లక్షలు
(ఏడాదికి రూ.14 వేల కోట్లు)
లక్ష్మీనివాస్‌ మిట్టల్‌
సీఈవో, ఛైర్మన్‌, ఆర్సెలర్‌-మిట్టల్‌ స్టీల్‌ ఇండస్ట్రీస్‌
ఆదాయం: రూ.1,25,570
(ఏడాదికి రూ.6600 కోట్లు)
సచిన్‌ టెండూల్కర్‌
క్రికెటర్‌
ఆదాయం: రూ.1163
(ఏడాదికి రూ.61.15 కోట్లు)
ఓప్రా విన్‌ఫ్రే
అమెరికన్‌ టీవీ యాంకర్‌
ఆదాయం: రూ.17,100
(ఏడాదికి రూ.900కోట్లు)
స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌
హాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత
ఆదాయం: రూ.25,100
(ఏడాదికి రూ.1320 కోట్లు)
జె.కె.రోలింగ్‌
'హ్యారీ పాటర్‌' సిరీస్‌ రచయిత్రి
ఆదాయం: రూ.9,200
(ఏడాదికి రూ.488 కోట్లు)
ముఖేష్‌ అంబానీ
సీఎండీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
ఆదాయం: రూ.413
(ఏడాదికి రూ.21.72 కోట్లు)
ఇంద్రానూయీ
ఛైర్మన్‌, సీఈవో, పెప్సీ కో
ఆదాయం: రూ.2,900
(ఏడాదికి రూ.153 కోట్లు)
బ్రిజ్‌వోహన్‌లాల్‌ ముంజాల్‌
హీరో గ్రూపుల అధినేత
ఆదాయం: రూ.255
(ఏడాదికి రూ.13.4 కోట్లు)
ఐశ్వర్యారాయ్‌
నటి
ఆదాయం: రూ.290
(ఏడాదికి రూ.15.3 కోట్లు)
అమితాబ్‌బచ్చన్‌
నటుడు
ఆదాయం: రూ.360
(ఏడాదికి రూ.19 కోట్లు)
మన్మోహన్‌ సింగ్‌
ప్రధానమంత్రి
ఆదాయం: రూ.0.68పై.
(ఏడాదికి రూ.3,60,000)
షారుక్‌ఖాన్‌
నటుడు
ఆదాయం: రూ.247
(ఏడాదికి రూ.13 కోట్లు)
(Eenadu, 30:09:2007)

No comments:

Post a Comment