Friday, December 18, 2009

సిల్లి పాయింట్


*మన పాలపుంతలోని నక్షత్రాలను సెకనుకొకటి చొప్పున లెక్కపెట్టడం వెుదలుపెడితే పూర్తయ్యేసరికి దాదాపు మూడువేల సంవత్సరాలు పడుతుంది.

*వాల్ట్‌డిస్నీకి ఎలుకలంటే భయం(మ్యూసోఫోబియా).

* దోమకాటుకు విరుగుడుగా వాడే మస్కిటో రిపెల్లెంట్స్‌ దోమల ఘ్రాణశక్తిని తాత్కాలికంగా పోగొడతాయి.

* బూట్లకు కట్టుకునే లేసుల చివరి ప్లాస్టిక్‌ భాగాల్ని 'ఎగ్లెట్స్‌' అంటారు.

* టైటానిక్‌ ఓడ సముద్రంలో ఐస్‌బెర్గ్‌ను ఢీకొనే సమయానికి దాని వేగం గంటకు 22నాటికల్‌ మైళ్లు.

* మియామీలో చెంచాల మ్యూజియం ఉంది. దాదాపు 5,400 రకాల చెంచాలను అందులో ప్రదర్శనకు ఉంచారు.

* 'శాటిలైట్‌ టెలివిజన్‌ ఫర్‌ ఏసియన్‌ రీజియన్‌ టీవీ'కి సంక్షిప్త రూపం స్టార్‌టీవీ.

* ప్రపంచంలో ఎక్కువ మందికి తెలిసిన బ్రాండ్లు వరసగా... కోకాకోలా, మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం.

* ఒకే నెల్లో రెండు పున్నములు వస్తే ఆ రెండో పౌర్ణమిని 'బ్లూమూన్‌' అంటారు. అలాగే రెండు అమావాస్యలు వస్తే రెండో అమావాస్య రోజును 'బ్లాక్‌మూన్‌ డే' అంటారు.

* పిల్లుల కన్నా కొన్ని వందల సంవత్సరాల ముందునుంచే ఫెర్రెట్లు మనిషికి పెంపుడు జంతువులు.

* తమ వాణిజ్యప్రకటనల్లో నటించిన మైకేల్‌జోర్డాన్‌కు 'నైకే' కంపెనీ 1992లో చెల్లించిన సొమ్ము 20మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు. ఆ ఏడాది * మలేషియా దేశంలో పనిచేసిన నైకే సిబ్బంది వెుత్తం జీతం(18మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) కన్నా అది ఎక్కువ.


* హెన్రీఫోర్డు తన 'ట్' వోడల్‌ కార్లను వెుదట్లో కేవలం నలుపురంగులో మాత్రమే తయారుచేశాడు. దానికి కారణం నల్ల పెయింట్‌ మిగతా రంగులకన్నా త్వరగా ఆరుతుంది.

* ఇంగ్లిషు అక్షరాలు ఇ, జ్ లపైన ఉండే చుక్కల్ని టిటిల్స్‌ అంటారు.

* టీవీ చూడటం పిల్లలకు సహజ పెయిన్‌కిల్లర్‌గా పనిచేస్తుంది.

* హిట్లర్‌ కన్నా చార్లీ చాప్లిన్‌ సరిగ్గా నాలుగు రోజులు పెద్ద. హిట్లర్‌ పుట్టింది 1889 ఏప్రిల్‌ 20న అయితే చార్లీ చాప్లిన్‌ ఆనెల పదహారున జన్మించాడు.


* స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ కిరీటంలో ఏడు ముళ్లుంటాయి.

* వెస్ట్‌వర్జీనియా(అమెరికా)లో ఒకప్పుడు '6' అనే పేరుగల నగరం ఉండేది.

* రోమన్‌చక్రవర్తి కలిగ్యులా తన గుర్రాన్ని మంత్రిని చేశాడు.

* కాంతి వేగంతో ప్రయాణిస్తే చంద్రుడి మీదకు 1.4సెకన్లలో చేరుకోవచ్చు.

* ఇంగ్లిష్‌ రైమ్స్‌లో ఎక్కువగా ఉండే పేరు జాక్‌.


* చంద్రుడిపై అడుగిడిన తొలి మానవుడు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ముందుగా తన ఎడమపాదాన్ని వోపాడు.






(Eenadu, 30:09:2007)

No comments:

Post a Comment