నిజంగానే చిరునవ్వుల తోనూ ,సిరిమల్లెల్ల తోనూ,హృదయాలు పలుకుతాయి.అతను ప్రేయసి కోసం వసంతాలు దోసిట పట్టగలడు,తారలను దీపాలు చెయ్యగలడు. ఆమె కూడా అంతే,ఉరికే సెలయేరులనూ,ఉరిమే మేఘాలనూ అతనిలోనే చూస్తుంది.
చిరునవ్వుల తొలకరిలో
సిరిమల్లెల చినుకులలో
పలికేనులే హృదయాలే
పలికేనులే హృదయాలే
తొలి వలపుల కలయికలో "చిరునవ్వుల "
వసంతాలు దోసిట దూసి విసిరెను నీ ముంగిలిలో
తారలనే దివ్వెలు చేసి వెలిగింతు నీ కన్నులలో
నీవే నా జీవనాదిగా
నీవే నా జీవనాదిగా ఎగసేను గగనాల అంచులలో
విరియునులే ఆ గగనాలే నీ వెన్నెల కౌగిలిలో "చిరునవ్వుల"
ఉరికే సెలయేరులన్నీ ఒదిగిపోవు నీ నడకలలో
ఉరిమే మేఘాలన్నీ ఉలికిపడును నీ పలుకులలో
నీవే నా పుణ్య మూర్తిగా
నీవే నా పుణ్య మూర్తిగా ధ్యానింతు నా మధుర భావనలో
మెరియునులే ఆ భావనలే ఇరు మేనుల అల్లికలో "చిరునవ్వుల"
చిత్రం చాణక్యచంద్రగుప్త
రచన సి.నారాయణ రెడ్డి
సంగీతం పెండ్యాల
చిత్రం చాణక్యచంద్రగుప్త
రచన సి.నారాయణ రెడ్డి
సంగీతం పెండ్యాల
No comments:
Post a Comment