Sunday, April 18, 2010

గాంధీ తాత కథలో ఆణిముత్యాలు!


రోజు గాంధీ జయంతి అనితెలుసుగా.. సందర్భంగాఆయన ఆత్మకథలోని కొన్నిఅంశాలను ఆయన మాటల్లోనేచదువుకుని, వాటిలోంచిమనమేంనేర్చుకోవాలోతెలుసుకుందామా?

* ''
మా బంధువు ఒకతనిమాటలు విని నాకు సిగరెట్టుతాగాలనే కోరికకలిగింది. కానీ మాదగ్గర డబ్బుల్లేవు. పదమూడేళ్లవయసులో మొదటిసారిగాసిగరెట్లకోసం నౌకర్ల వద్ద నుంచి డబ్బులుదొంగిలించాను. తర్వాతనాపదిహేనో ఏట మా అన్నతోకలిసి మరో పెద్ద దొంగతనంచేశాను. మా అన్న 20రూపాయలు అప్పుబడ్డాడు. అదితీర్చడానికి అన్న చేతికి ఉన్న బంగారుమురుగు నుంచి ఒక తులం ముక్కతీయించి అప్పు తీర్చాం. కానీ పని నాకునచ్చలేదు. చేసిన దోషాన్నిఅంగీకరిస్తేననే బుద్ధి వస్తుందని భావించాను. విషయం నాన్నకు చెప్పాలనినిర్ణయించుకున్నాను. ఒక చీటీ మీద చేసినతప్పంతా రాసి క్షమించమనిఆయనకు అందించాను''
ఏం నేర్చుకోవాలి: చేసిన తప్పును అంగీకరించే నిజాయితీనిఅలవర్చుకోవాలి. దాన్ని కప్పిపుచ్చుకోడానికిచూడకూడదు.

* ''
హైస్కూల్లో నాకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. దాంట్లో ఒకడిలో కొన్నిదురలవాట్లు ఉన్నాయి. ఇది నచ్చని నామరో మిత్రుడు నా స్నేహాన్నివదిలేశాడు. అమ్మా అన్నయ్యలు కూడా అతనితో స్నేహం వద్దని చెప్పారు. 'మీరు చెప్పినదోషాలు అతనిలో ఉన్నమాట నిజమే. దురలవాట్లనునేనంటించుకోను. అతన్నే మంచివాడిగా తీర్చిదిద్దుతాను' అనివాళ్లనుసమాధానపరిచాను. కానీ అతడు తన బుద్ధి పోనిచ్చుకోలేదు. అతనితో స్నేహంచేయడం నాదే పొరబాటనితర్వాత నాకు తెలిసింది. ఇతరుల్ని మంచిమార్గంలోపెట్టడానికి మరీ లోతుకు పోకూడదని గ్రహించాను. ఎవరితోనూ అతిస్నేహంపనికిరాదు. అందరితో చెలిమిగా ఉండడమే మంచి లక్షణం''
ఏం నేర్చుకోవాలి:చెడు అలవాట్లు ఉన్న స్నేహితులను గమనించుకునివారికి దూరంగా ఉండాలి.

* ''
నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు పాఠ్యవిషయాలను ఎక్కువగాఇంగ్లిషులో చెప్పేవారు. రేఖాగణితం నాకు కొత్త. దాన్ని ఇంగ్లిషులో చెప్పడం వల్లఅది నాకు గుదిబండ అయింది. బాగా కష్టపడి చదవడం ప్రారంభించాను. దాంతోఅదినాకు సులభంగా బోధపడిపోయింది. తగిన కృషి చేస్తే విషయమైనా తప్పకఅర్థమవుతుంది. అప్పటి నుంచిరేఖాగణితంపై నాకు అభిరుచి పెరిగింది''
ఏం నేర్చుకోవాలి: పాఠ్యాంశమైనా అర్థం కాకపోతే దాన్ని మరింతపట్టుదలతో చదివితే అది సులువుగామారిపోతుందని గ్రహించాలి.

* ''
ఒక పొరపాటు వల్ల కలిగిన ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను.చదువుకునేప్పుడు అందంగా రాయాల్సిన అవసరంలేదనే తప్పు అభిప్రాయం నాలోకలిగింది. తర్వాత అది తప్పని గ్రహించాను. వంకర టింకర అక్షరాలుఅసంపూర్ణవిద్యకు చిహ్నమని నాకు అనిపించింది. నన్ను చూసి ప్రతి బాలుడు,బాలిక జాగ్రత్తపడాలని కోరుతున్నాను. మంచిదస్తూరి విద్యలో భాగమని అందరూగుర్తించాలి''
ఏం నేర్చుకోవాలి: చిన్నప్పటి నుంచే చక్కని దస్తూరిని అలవర్చుకోవాలి.
(గాంధీజీ ఆత్మకథ 'సత్యశోధన'లో ఇలాంటి స్ఫూర్తిదాయకమైన అంశాలెన్నో ఉన్నాయి. మీరంతా తప్పక చదువుతారు కదూ!)

No comments:

Post a Comment