Saturday, January 2, 2010

ఒకటే జననం.. ఒకటే మరణం.

చిత్రం : భద్రాచలం
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : శంకర్ మహదేవన్, చిత్ర

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు..
బతుకు అంటె గెలుపూ గెలుపుకొరకె బ్రతుకు..
కష్టాలు రానీ కన్నీళ్ళు రానీ
ఏమైన గానీ ఎదురేది రానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు
నిద్ర నీకొద్దు నీకేది హద్దు

||ఒకటే||

రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి
ఆ గెలుపూ తప్పట్లే గుండెలలో మోగాలీ
నీ నుదిటీ రేఖలపై సంతకమే చేస్తున్నా
ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా
నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం

నీలికళ్ళలో మెరుపూ మెరవాలి
కారు చీకట్లో దారి వెతకాలి
గాలివానల్లో ఉరుమై సాగాలి
తగిలే గాయాల్లో గేయం ఊదాలి

||ఒకటే||

నిదరోకా నిలుచుంటా.. వెన్నెలలో చెట్టువలె
నీకోసం వేచుంటా.. కన్నీటీ బొట్టువలె
అడుగడుగు నీ గుండె ..గడియారం నేనవుతా
నువు నడిచే దారులలో.. ఎదురొచ్చి శుభమవుతా
రాసిగ పోసిన కలలన్నీ దోసిలి నిండా నింపిస్తా
చేతులు చాచిన స్నేహంలా ...

ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
పట్టుకున్నావా పాటే అవుతుంది
అల్లుకున్నావా జల్లే అవుతుంది
హత్తుకున్నావా వెల్లుఔతుంది...

||ఒకటే||

ఈ నూతన సంవత్సరం ఈ పాటలా మీలో ఉత్తేజాన్ని నమ్మకాన్ని నింపి మీకందరికీ అన్ని శుభాలను చేకూర్చాలని, మీరు కోరుకున్న రీతిలో జీవిస్తూ సుఖసంతోషాలను మీ సొంతం చేసుకోవాలని ఆశిస్తూ.

No comments:

Post a Comment