1985లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ 'అమెరికా ప్రెసిడెన్షియల్ ఫ్రీడం మెడల్'ను మదర్‌థెరీసాకు బహూకరిస్తూ, 'ఈమె దీన్ని భారత్‌కు తీసుకెళ్లి, కరిగించి ఆ డబ్బుల్ని పేదలకోసం ఖర్చు చేస్తుందేవో' అని చమత్కారంగా వ్యాఖ్యానించారు. అవును మరి, ఇచ్చే మనసున్నవారికి ఇవ్వడంలో లభించే తృప్తి మరెందులోనూ దొరకదు.
దానం ఇవ్వడాన్ని వ్యక్తిగత బాధ్యతగా బోధిస్తుంది రుగ్వేదం. తమ ఆస్తిలో పదోవంతు ఆదాయాన్ని దానంగా ఇవ్వాలని బైబిలూ 2.5 శాతం 'జకాత్'గా ఇచ్చేయాలని ఖురానూ చెబుతున్నాయి. అంటే అన్ని మతాలూ ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించమనే చెబుతున్నాయి. బహుశా దీన్నే కార్పొరేట్ కంపెనీలు తమ అభిమతం చేసుకున్నట్లున్నాయి.
వెున్నటికి వెున్న తన సంపదలో 85శాతం వాటాను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించి దాతల్లోకెల్లా మహాదాత అనిపించుకున్నారు 'బెర్క్‌షైర్ హాతవే' ఛైర్మన్వారెన్ బఫెట్. ఈ వితరణ విలువ సుమారు లక్షా డెబ్భైవేల కోట్ల రూపాయలు. సంతానం కోసం కొద్దిగా అట్టిపెట్టారాయన. దీనికి బఫెట్ ఇచ్చిన సమాధానం చాలా చిన్నది, కానీ ఎంతో లోతైంది. 'నువ్వు ఎవరికి పుట్టావన్నదే సమాజంలో నీ స్థానాన్ని నిర్ణయించకూడదు'...అన్నదే ఆ సమాధానం. తన కుమారులనుద్దేశించి ఆయన అలా వ్యాఖ్యానించినా దీన్ని మనం పేదలకూ అన్వయించుకోవచ్చు.
చేసిన మేలును చెప్పుకోకూడదంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అలా చెప్పడమే మంచిదేవో. అప్పుడే ఇంకొకరికి మంచి చేయాలన్న స్ఫూర్తి కలుగుతుంది. మంచి చేయడంలో మించిపోవాలన్న పట్టుదల పెరుగుతుంది. అది పనిలోనైనా ఆపన్నులపట్ల ప్రేమలోనైనా.
పోటీతత్వం... ఇదేగా కార్పొరేట్ మంత్రం! మహా దాతలు!
మనిషి జీవితం డబ్బు, పేరు, తృప్తి చుట్టూ తిరుగుతుంటుంది. వయసు పెరిగినకొద్దీ ప్రాధాన్యాలు మారుతుంటాయి. శాశ్వత తృప్తిని మిగిల్చేది సామాజిక సేవేనని అత్యధికుల విశ్వాసం. అందుకే చేతనైన సాయం చేస్తారు. పారిశ్రామికవేత్తలూ అదేకోవలోకి వస్తారు. అయితే అంతర్జాతీయ వ్యాపారవేత్తలతో పోల్చితే మన ప్రముఖులు ఇచ్చే విరాళాలు తక్కువే. మనకంటే సంపద సృష్టిలో వాళ్లు ముందుండడం అందుకు ఓ కారణం కావచ్చు. కొందరు చేసిన దానధర్మాల సొమ్ము చూస్తే కళ్లు చెదురుతాయి.
* ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అనిపించుకున్నారు అమెరికా పారిశ్రామికవేత్త జాన్ డేవిసన్ రాక్‌ఫెల్లర్. గుత్తాధిపత్యానికి పెట్టింది పేరు. అలాంటివ్యక్తిలో సేవాభావం ఉప్పొంగాక విద్య, ప్రజారోగ్యం కోసం తన సగం సంపద ఖర్చుచేశారు. 1913లో ఏర్పడిన రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్‌కు 25కోట్ల డాలర్లు వితరణ చేశారు. 1937లో ఆయన చనిపోయినప్పుడు, 'నానారకాలుగా డబ్బు సంపాదించిన రాక్‌ఫెల్లర్ తన సేవాభావంతో పునీతుడయ్యారు' అంటూ విమర్శకులు ప్రశంసించారు.
* స్కాట్‌లాండ్‌కు చెందిన ఆండ్రూ కార్నిగీ అసలు సిసలు వ్యాపారి అనిపించుకున్నారు. తర్వాత మనసు మారి బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో సేవాకార్యక్రమాలు చేపట్టారు. దాదాపు మూడువేల గ్రంథాలయాలకు నిధులిచ్చారు. తన జీవితకాలంలో 35కోట్ల డాలర్లు ధర్మాలకే వెచ్చించారు. 1919లో మరణించిన కార్నిగీకి ఆస్తిని కొడుకులకు పంచడంలో తర్కం కనిపించలేదు. 'నేను కష్టపడ్డాను. వాళ్లు కాదు'... అదీ ఆయన చెప్పిన సమాధానం.
* తొలినుంచీ మనసున్నవాడిగానే జీవించిన ఫోర్డ్ వోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ తన పేరుమీదే ఫౌండేషన్ నెలకొల్పారు. కంపెనీలోని కొన్ని షేర్లను మళ్లించి దాన్ని స్వతంత్రంగా సేవలందించేలా నిలబెట్టారు. యాభైదేశాల్లో దీని కార్యకలాపాలు సాగుతున్నాయి. ఒక్క 2006 సంవత్సరంలోనే ఈ సంస్థ అందజేసిన వితరణ రూ.2300 కోట్లు.
* 'ఇంటెల్' సహ వ్యవస్థాపకుడు గార్డన్ మూర్ ప్రపంచంలో అత్యంత ఉదారస్వభావమున్న దాతల్లో ఒకరు. పర్యావరణ ప్రేమికుడు, రచయిత కూడా అయిన మూర్ తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటిదాకా అందించిన ఆర్థికసాయం విలువ సుమారు రూ.30,000 కోట్లు.
* ప్రపంచంలో తొమ్మిదో అత్యంత ధనవంతుడైన చైనా సంతతి లికా షింగ్వ్యాపార సామ్రాజ్యం 50కి పైగా దేశాల్లో విస్తరించింది. హచిసన్ వాంపో లిమిటెడ్, చ్యుంగ్ కాంగ్ (హోల్డింగ్స్) లిమిటెడ్ సంస్థల యజమాని అయిన లికా తన పేరుమీదుగానే ఫౌండేషన్ నెలకొల్పారు. దానికి తన బీమా కంపెనీలోని 30 శాతం వాటాను (సుమారు రూ.1200 కోట్లు) విరాళంగా ప్రకటించారు. విద్య, ఆరోగ్యం ప్రధానాంశాలుగా ఆయన వాగ్దానం చేసిన విరాళాల వెుత్తం సుమారు రూ.25,000 కోట్లు.
* ఐక్యరాజ్యసమితికి రూ.4500 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు టెడ్ టర్నర్. 'చెక్ రాస్తున్నప్పుడు నా చేతులు వణికాయి. నా చేతులారా ప్రపంచంలోకెల్లా ధనవంతుడిని అయ్యే అవకాశం వదులుకుంటున్నాను కదా అనిపించింది' అని చమత్కరించారాయన. పర్యావరణ ప్రేమికుడు అయిన ఈ సీఎన్‌ఎన్ వ్యవస్థాపకుడు 'టర్నర్ ఫౌండేషన్' నెలకొల్పారు.
* హంగెరీలో జన్మించి అమెరికాలో ఆర్థికవేత్తగా ఎదిగిన జార్జిసొరోస్ స్టాక్‌మార్కెట్ పెట్టుబడులతో కోట్లు గడించారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు గురైన నల్లజాతీయులకు ఎన్నో సేవలందించారు. స్వేచ్ఛాయుత సమాజస్థాపనే ధ్యేయంగా 'ఓపెన్ సొసైటీ ఇన్‌స్టిట్యూషన్' నెలకొల్పారు. యాభై దేశాల్లో విస్తరించిన ఈ సంస్థ ప్రతి ఏటా అందించే ఆర్థిక సాయం సుమారు రూ.1600 కోట్లు.
* 'బ్లూంబర్గ్ ఎల్‌పీ కంపెనీ' అధిపతి, న్యూయార్క్ మేయర్ మైకేల్ బ్లూంబర్గ్2005లో రూ.654 కోట్లు విరాళమిచ్చారు. 987 స్వచ్ఛంద సంస్థలకు ఆ సొమ్మును పంచారు. దానం
అన్నదానం, రక్తదానం, విద్యాదానం... దానం ఎన్నో రకాలు. ఈ భౌతిక ప్రపంచంలో మనుషులు దానం చేయడం మరచిపోయుంటారని పొరబడే అవకాశముంది. కానీ అది నిజంకాదు. పి.ఆర్.ఐ.ఎ.(పార్టిసిపేటరీ రీసెర్చ్ ఇన్ ఆసియా) సర్వే ప్రకారం ఏటా సుమారు ఏడున్నర కోట్ల భారతీయ కుటుంబాలు సేవా కార్యక్రమాలకోసం విరాళాలు ఇస్తున్నాయట. సంస్థాగత దానాల విషయానికొస్తే 2005లో అంతర్జాతీయంగా పేరువోసిన 211 కంపెనీలు ఉమ్మడిగా సుమారు రూ.44,000 కోట్లు దానమిచ్చాయి.
ఎవరైనా దానం ఎందుకు చేస్తారు? దీనిమీదే 'ఆసియా పసిఫిక్ ఫిలాంత్రపీ కన్సార్టియమ్' అధ్యయనం చేసింది. దాని ప్రకారం పేదల కష్టాలను చూడలేని జాలిగుణం 68 శాతం మందిని స్పందింపజేస్తోంది. సాయం చేస్తే మనసుకు సంతోషం కలుగుతుందని 48 శాతం మంది జవాబిచ్చారు. మతవిశ్వాసాలవల్ల 46 శాతం మంది దానం చేస్తారు. నిజమైన హీరో
సెలబ్రిటీల్లోకెల్లా దయాగుణం ఉన్నవాడిగా జాకీచాన్‌ను ఫోర్బ్స్ మ్యాగజైన్ కొనియాడింది. 1988లో 'జాకీచాన్ ఫౌండేషన్' నెలకొల్పాడు జాకీ. పేదరికం, ప్రకృతి బీభత్సం ఆయన్ని కదిలించే అంశాలు. సునామీ బాధితులకోసం యునిసెఫ్‌కు రూ.30 లక్షల ఆర్థికసాయం ప్రకటించాడు. ఇల్లులేనివారికోసం పనిచేస్తున్న అమెరికాలోని క్రిసాలిస్ అనే స్వచ్ఛందసంస్థకు రూ.45 లక్షలు అందించాడు. రెడ్‌క్రాస్, వరల్డ్ ఎయిడ్ లాంటి డజను స్వచ్ఛంద సంస్థలకు తరచూ విరాళాలు ఇస్తుంటాడు. వెుత్తంగా సుమారు 300 కోట్ల రూపాయలు దానధర్మాలు చేశాడీ యాక్షన్‌హీరో. తన సగం సంపద దానమిస్తానని ఇదివరకే ప్రకటించాడు. ఆ సొమ్ము ముఖ్యంగా యువతకు ఉపయోగపడాలనేది ఆయన కోరిక. జాకీ వ్యక్తిగత ఆస్తి విలువ సుమారు రూ.500 కోట్లు. ఆపదొస్తే ఆదుకుంటాం
ప్రైవేటు కంపెనీలు ఎన్నో రంగాల్లో ఎన్నో రకాలుగా పాటుపడుతున్నాయి.ఆరోగ్యసేవలే తీసుకుంటే, బజాజ్ సంస్థ ఔరంగాబాద్‌లో 'కమల్‌నయన్ బజాజ్ హాస్పిటల్' నిర్వహిస్తోంది. ముంబయిలోని హరికిషన్‌దాస్ ఆసుపత్రికి'ధీరూభాయి అంబానీ ఫౌండేషన్' ధర్మకర్త. 'ఇన్ఫోసిస్ ఫౌండేషన్' కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఆసుపత్రులు నిర్మించింది. 'సీఎస్‌ఆర్' అంతగా ప్రాచుర్యంలోకి రాకముందునుంచీ సామాజిక బాధ్యతను తనదిగా చేసుకున్న టాటా ముంబయిలో క్యాన్సర్ రోగుల కోసం 'టాటా మెవోరియల్ హాస్పిటల్' నిర్మించింది. ఆదిత్యబిర్లా గ్రూపు పుణెలో 500 పడకలతో 'ఆదిత్యబిర్లా స్మారక ఆసుపత్రి' నిర్మించింది. ఇందులో 60-70 పడకలు పేదవారికోసం కేటాయించారు. హోప్ ఫౌండేషన్‌కు అత్యధికంగా నిధులు సమకూరుస్తున్నది ఫినోలెక్స్ గ్రూపు. ఇక చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఆసుపత్రికి వెన్నుదన్నుగా ఉన్నవి ఒరాకిల్, హెచ్‌పీ, యాహూ లాంటివే. మనరాష్ట్రంలో సత్యం '108' సేవలు తెలిసినవే. 'ముందు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సంపద సృష్టి జరగాలి. తర్వాత దాన్ని పంపిణీ చేయాలి'అంటారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి. ఆ పంపిణీ సమాజసేవ రూపంలో జరుగుతోంది. ఎన్జీఓలకు అండదండ
గిరిజనుల పునరావాసం నుంచి పురజనుల సంక్షేమందాకా, బాలకార్మికుల విముక్తి నుంచి పల్లెప్రజల అభ్యున్నతి దాకా... పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఎన్నో, indianngos.com ప్రకారం దేశవ్యాప్తంగా వీటి సంఖ్య పదిహేను లక్షలు. వీటిల్లో కోటీ 94 లక్షల మంది పనిచేస్తున్నారని 'పీఆర్‌ఐఏ' అంచనా. ఇందులో 85శాతం మంది వలంటీర్లు. మిగిలినవారికి జీతాలు చెల్లించాలి. ఇన్ని లక్షల స్వచ్ఛందసంస్థల్లో సొంతంగా ఆర్థికవనరులు కలిగి ఉన్నవి చాలా తక్కువ. మరి ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి? ఎలా సేవలందిస్తున్నాయి? ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, కార్పొరేట్ సంస్థల నిధులే ప్రాణాధారం. కాల్గేట్, భారతి, సిటీగ్రూప్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌ఎస్‌బీసీ, ఏసీసీ, ఆసియన్ పెయింట్స్, ఐసీఐసీఐ...వంటి ప్రతీ సంస్థ కొన్ని ఎన్జీఓలకు అండదండగా ఉంటోంది. 'ఏ సమాజపు సహజ వనరులు వాడుకుని మేము సంపద సృష్టిస్తున్నావో ఆ సంఘానికి మా వంతు సేవ చేసి తీరాలి' అంటారు హీరోహోండా సీఎండీ బ్రిజ్‌వోహన్ లాల్ ముంజాల్.
(Eenadu,16:0

No comments:
Post a Comment