Tuesday, March 8, 2011

గుర్తుకొచ్చింది..... ఓ మంచి పాట



పల్లవి:

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక!
ఏ దారెటుపోతుందో ఎవరినీ అడగక!

ఎవరికెవరు (1 సారి)

జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!
జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!!

చరణం :

వాన కురిసి కలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో హా

వాన కురిసి కలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో
కదలి కదలి నదులన్నీ కలిసేది కడలిలో
కదలి కదలి నదులన్నీ కలిసేది కడలిలో

కానీ ఆ కడలి కలిసేది ఎందులో ?

ఎవరికెవరు (1 సారి)
ఎవరికెవరు ఈ లోకంలో...

జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!
జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!!


చిత్రం: సిరి సిరి మువ్వ( 1978 లొ విడుదల)
సంగీతం: K.V. మహదేవన్ గారు
సాహిత్యం: వేటూరి గారు
పాడిన వారు: S.P. బాల సుబ్రమణ్యం

No comments:

Post a Comment