కొబ్బరి శనగపప్పు పాయసం
కావలసిన పదార్థాలు
పాలు - ఒక లీటరు
శనగపప్పు - 1 కప్పు
కొబ్బరి పాలు - 2 కప్పులు
బొంబాయి రవ్వ - 1/4 కప్పు
బెల్లం - ఒకటిన్నర కప్పు
ఇలాచీలు - 2
నెయ్యి - 1 టేబుల్ స్పూను
జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ - తగినన్ని
తయారు చేసే పద్ధతి
కుక్కర్‌లో శనగపప్పు, రెండు కప్పుల నీరు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచితే పప్పు మెత్తగా ఉడుకుతుంది. విడిగా బెల్లంలో కొద్దిగా నీరుపోసి కరిగించి పెట్టుకోవాలి. ఉడికించిన శనగపప్పులో ముందుగా బొంబాయి రవ్వ(నీళ్లలో కలుపుకుని), తర్వాత బెల్లం పాకం, చివర్న కొబ్బరిపాలు పోసి కాసేపు ఉడకనివ్వాలి. దించే ముందు ఇలాచీ పొడి, నేతిలో వేయించిన డ్రైఫ్రూట్స్ వేయాలి.
కోవా కజ్జికాయ
కావలసిన పదార్థాలు
మైదాపిండి – అరకిలో
పంచదార – కిలో
పాలకోవా - పావుకిలో
జాపత్రి - 2 గ్రాములు
యాలకులు – 2 గ్రాములు
శనగపిండి – 50 గ్రాములు
వంట సోడా - పావు స్పూను
బేకింగ్ పౌడర్ – పావుస్పూను
నెయ్యి – 100 గ్రాములు
రిఫైన్డ్ ఆయిల్ - తగినంత
తయారు చేసే పద్ధతి
ఇండియన్ స్వీట్లలో కోవా కజ్జికాయ విశిష్టమైంది. కజ్జికాయ ఇష్టపడనివారు దాదాపుగా ఉండరు. కజ్జికాయ అనేక వెరైటీల్లో కోవా కజ్జికాయ రెసిపీ ఒకటి. రుచికరమైన కోవా కజ్జికాయ రెసిపీ తెలుసుకుందాం. ముందుగా శనగపిండిలో కోవా కలిపి కొంచెం వేయించి దించాలి. దానిలో జాపత్రిపొడి, యాలకులపొడి, కొంచెం పంచదార కలిపి ముద్దగా చేయాలి. బాణలిలో మిగిలిన పంచదార పోసి, 2 గ్లాసులు నీళ్ళు పోసి లేత పాకం వచ్చేవరకూ ఉంచి దించాలి. మైదాపిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి. అందులో కరగబెట్టిన నెయ్యి కలిపి నీళ్ళు చేర్చి గట్టి ముద్దలా చేయాలి. నిమ్మకాయంత ముద్దలను తీసుకుని పూరీలా, కొంచెం మందంగా ఒత్తి మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి, అంచులను తడిచేసి, కోవాకు దగ్గరగా చుట్టి కజ్జికాయలు చేయాలి. వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి, పంచదార పాకంలో వేసి ముంచి తీస్తే సరి, నోరూరించే కోవా కజ్జికాయలు సిద్దం!
కొబ్బరి వడలు
కావలసిన పదార్థాలు
కొబ్బరికాయ – 1
బియ్యం – పావుకిలో
నూనె – పావుకిలో
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి - 6
కొత్తిమీర – 1 కట్ట
జీలకర్ర – 1 టీ స్పూను
వంట సోడా – చిటికెడు
కరివేపాకు – 2 రెబ్బలు
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి
కొబ్బరిని తురమాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. బియ్యం కడిగి నానబెట్టాలి. నీళ్ళు ఓడ్చి, కొబ్బరి తురుము కలిపి రుబ్బుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి నూరి కలపాలి. వంటసోడా, ఉప్పు, తరిగిన కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. బాణలిలో నూనె కాగనిచ్చి కలిపి ఉంచుకున్న పిండిని వడల్లా వత్తి ఎర్రగా వేయించుకోవాలి. కొబ్బరి వడలు క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి.
No comments:
Post a Comment