Wednesday, August 31, 2011

వినాయక పూజలో పత్రి ఎందుకు?



(Vinayaka Pooja Benefits of Patri)
తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా జరిగేందుకు తొలి పూజ చేసేది వినాయకుడికేఅలాగే దక్షిణాయనంలో మనం జరుపుకునే పండుగలలో మొదటిది వినాయక చవితిఇక ఆ తర్వాత ప్రతినెలలోనూ ఏదో ఒక పండుగ మనల్ని పలకరిస్తుందిసంతోషాన్ని అందిస్తుంది.
దేవతలలో విఘ్నాధిపతి లంబోదరుడుగణపతి సిద్ధి,బుద్ధి ప్రదాతగణేషుని ఆకృతి ఆధ్యాత్మికంగా చూస్తే అనేక కొత్త అర్ధాలు చెబుతుందిఆ ఆకృతిలోని అంతరార్థము తెలుస్తుందిగజాసుర సంహారం,వినాయకుని జన్మ వృత్తాంతం మనకు తెలుసు.మనకు తెలియనిదల్లా ఆయనకు చేసే పూజ గురించే.వినాయకుడు పత్రి ప్రియుడుపత్రితో మనం చేసే పూజ ఆయన అనుగ్రహాన్ని కలిగిస్తుందిఏనుగు తినే ఆహారమే పత్రి అనివినాయకునికి ఏనుగు తల ఉంది కాబట్టి ఆకులుపూవులతో కూడిన పత్రిని నైవేద్యంగానోపూజా ద్రవ్యంగానో సమర్పిస్తున్నామని చాలామంది అనుకుంటుంటారుకానీ అది నిజం కాదుమరి పత్రివల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
వినాయకుని పూజకు మనం వాడే పత్రిలో ఆకులుకాయలుపూలుపండ్లు ఉన్నాయివీటిలో ఎనలేని ఔషధ గుణాలున్నాయి.కేవలం స్పర్శామాత్రంతో కొన్ని రకాల అతి సామాన్య వ్యాధులను నయం చేయగల శక్తి వీటికి ఉందికొన్ని రకాల ఆకులు గదిలో ఒక విధమైన పరిమళాన్నిస్తూ ఆరోగ్యకరమైన ప్రాణవాయువును అందిస్తాయిమన పూర్వీకులకు వీటి గుణాలు తెలుసుఆ ఔషధాలన్నింటినీ నట్టింటికి రప్పించేందుకు చేసిన ప్రయత్నమే ఈ పూజ అని గుర్తించాలిఏదో సంవత్సరానికి ఓసారి ఇలా పూజ కోసం ఆ ఔషధ గుణాలున్న పత్రిని ఇంటికి తీసుకువస్తే సరిపోతుందాఆరోగ్యం చేకూరిపోతుందాఅనే సందేహం రావడం సహజం.నిజం చెప్పాలంటే ఒకసారి చేసినంతలో పెద్దగా ప్రయోజనం ఉండదుకాకపొతే ప్రతిరోజూ ఇన్ని నియమాలతో పూజ చేయడం కష్టం కాబట్టి ఆ ఏర్పాటు చేశారు.
భాద్రపద మాసంలోనే పత్రితో పూజ ఎందుకు చేయాలిఎప్పుడో ఒక్కప్పుడు చేస్తే సరిపోతుందాఅని మరో ప్రశ్న కలగొచ్చుదానికి సమాధానం ఏమిటంటే... ఇతర సందర్భాల సంగతి అలా ఉంచి భాద్రపద మాసంలో తప్పక చేయాలిఎందుకంటే.. భాద్రపదమాసంలో వానలు పడుతూఎక్కడికక్కడ చిత్తడిగాబురదగా ఉంటుందిగుంటల్లో నీళ్ళు నిలిచి సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందిఇలాంటి సమయంలో వినాయకునికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడంవల్ల ఇంట్లో వాతావరణం బాగుండి,సూక్ష్మ క్రిములను నశింపజేస్తుంది.
గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీఈ తొమ్మిది రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉందికొన్నిచోట్ల రానురాను మరుగున పడుతోందికొందరు పూజ ముగిసిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని తొలగించినప్పటికీ పత్రిని మాత్రం కనీసం తొమ్మిది రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారుఅంటేపదిరోజులపాటు మనం ఔషధ గుణాలున్న పత్రి నుండి వచ్చే గాలిని పీలుస్తాం.
తొమ్మిది రోజుల తర్వాత సమీపంలోని నదిలోనోచెరువులోనో నిమజ్జనం చేయడం వల్ల కూడా లాభమే చేకూరుతుందిపత్రిలోని ఔషదగుణాలలో కొన్నయినా ఆ నీటిలో చేరతాయిఆ రకంగా అవి నీటిలోని క్రిములను నశింపజేస్తాయిఆ నీటిని తాగినప్పుడు అనారోగ్యాలు కలగవు.
తొమ్మిది రోజులు జరిపే పూజ వల్ల ఆరోగ్యపరంగా సత్ఫలితం కలుగుతుందని నమ్మటం మూఢనమ్మకం కాదుశాస్త్రీయంగా ఇది నిజమేవినాయక వ్రతం ఆచారం వెనుక ఉన్న ఆయుర్వేద పరమైన కారణం ఇదివినాయకుని పూజించే పత్రిలో ప్రధానంగా ఉండాల్సినవి గరికతులసినేరేడుమారేడుమరువంఉమ్మెత్తఉత్తరేణి తదితర ఔషధ గుణాలున్న పత్రాలువీటివల్ల ఎలాంటి ఉపయోగం కలుగుతుందో తెలుసుకుందాం.
తులసి
తులసివల్ల జరిగే మేలు గురించి ఏకంగా ఒక పుస్తకమే రాయొచ్చుకఫం మొదలైన అనేక రోగాలను తగ్గిస్తుంది.
జిల్లేడు
చర్మ వ్యాధులనుశ్వాసకోశ వ్యాధులను జిల్లేడు నశింపచేస్తుందినరాలకు సత్తువనిస్తుందిజిల్లేడు ఆకులనుండి వచ్చే మొత్తం శరీరంలోని దోషాలను నివారిస్తుందిశరీరానికి ఆరోగ్యం కలిగిస్తుంది.
రేగు
అతిసారంరక్తదోషాలను మటుమాయం చేస్తుందికేశ వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుందిరేగు ఆకులనే ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి.
మరువం
మరువపు పరిమితం వాతావరణాన్ని ఆహ్లాదంతో నింపుతుంది.శ్వాసచెవి సమస్యలు తగ్గుతాయి.
రావి
రావి ఆకులు మానసును కేంద్రీకరించేందుకు తోడ్పడతాయి.
దానిమ్మ
దానిమ్మ పూలుబెరడుకాయలను ఆయుర్వేదంలో ఔషధాలుగా ఉపయోగిస్తుంటారువర్షాకాలంలో వచ్చే నీళ్ళ విరోచనాలవంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఉత్తరేణి
ఉత్తరేణి వేరును మొహం కడుక్కోవడానికి ఉపయోగిస్తుంటారుఉత్తరేణి అత్యుత్తమ ఔషధ గుణాలు కలిగి ఉందని నిర్ధారించారు.
బిల్వపత్రం
సూక్ష్మక్రిములను హరిస్తుందిచర్మవ్యాధులను నివారిస్తుందిగాలి చొరని గర్భగుడుల్లో బిల్వపత్రాలతో పూజించడంవల్ల స్వచ్చత చోటు చేసుకుంటుంది.
నేరేడు
నేరేడు కాయ అతి మూత్ర వ్యాధిని తగ్గిస్తుందినేరేడు ఆకుల నుంచి వీచే గాలి ఆరోగ్యానికి మంచిది.
మారేడు
త్రిదోషాలను హరిస్తుందిసకల దోషాలను హరిస్తుంది.
గరిక
ముక్కు సంబంధమైన అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.
మాచీ పత్రి
వ్రణాలుదద్దుర్లువాత రోగాలు,నులిపురుగులను తగ్గిస్తుందికొన్ని రకాల జ్వరాలను కూడా ఇది తగ్గించగలదుఅతి దాహాన్ని హరిస్తుంది.
జమ్మి
ఈ పేరు వినగానే మనకు గుర్తు వచ్చేది దసరా పండుగశమీ పూజ చేస్తాం కదాకఫశ్వాస రోగాలను తగ్గించడంలో జమ్మి చెట్టు ఆకులు,బెరడు బాగా పనిచేస్తాయి.
మునగాకు
కఫాన్నివాతాన్ని హరించి శ్వాసను క్రమబద్ధం చేస్తుంది.
ఇలా చెప్పుకుంటూపొతే ఒక్కో మొక్కదీ ఒక్కో ప్రత్యేకతవినాయకుని నిత్యం అర్చిస్తుంటే శుభాలు తప్పక కలుగుతాయినవరాత్రులలో చేసిన విధంగా కాకుండా ప్రతిరోజూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు స్మరిస్తే మంచి కలుగుతుంది.మనం కోరే ఫలితాన్ని బట్టి వినాయకుని ప్రతిమను ఏర్పరచుకోవాలని కూడా పెద్దలు చెప్పారు.
గణపతి బంగారు ప్రతిమను పూజిస్తే ఐశ్వర్యంవెండి ప్రతిమను పూజిస్తే ఆయుష్షురాగి ప్రతిమను పూజిస్తే సంకల్ప సిద్ధి కలుగుతాయివినాయక వ్రతం ఎప్పుడు శుభకరమేగణేశ చతుర్థి రోజు ఈ వ్రతం ఆచరిస్తే చదువులో వెనుకబాటు ఉండదువృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి ఆటంకాలూ ఉండవుఅందరూ కలిసి చేసుకునే పర్వదినాల్లో వినాయక చవితి ముఖ్యమైందిఇలాంటి పండుగలవల్ల వ్యక్తిగతంగా ప్రశాంతత చేకూరడమే కాకుండా ఐకమత్యం పెరిగి సమాజానికి మేలు జరుగుతుంది.

No comments:

Post a Comment