Friday, January 28, 2011

telugu kavitalu

అందిరాని అవకాశానికై ఎదురు చూచే కన్నా ..
అనువైన అవకాశాన్ని అందుకొని ఎదగడం మిన్న ..

కలిసిరాని కాలం అని నిందించి మిన్న కుండేకన్నా ..
ఫలితాన్ని పక్కనపెట్టి కష్టించడం మిన్న .. 



**//**ఆకాశంలో నక్షత్రాలెన్నో.. లెక్కెట్ట వచ్చు ..కష్టపడితే
భూమి పై చెట్లేన్నో.. చేదించ వచ్చు ..శ్రమిస్తే
సూర్యునిలోని శక్తి ఎంతో.. తెలుసుకోవచ్చు ..సాంకేతిక పరిజ్ఞానం తో (నిపుణుల సాయంతో)
అమ్మ ప్రేమ ఎంతో.. కొలవగలరా ఎవరైనా?? ..ఈ అవని పైన .. ?? 



**//**గాలి నై..నీ శ్వాస అయ్యాను..
దిశ తెలియని జీవితానికి ..దిక్సూచి నయ్యాను..
నన్ను నన్నుగా నమ్మిన నీకు..ఎలా కనుమరుగావ్వగలను ..?
నీ మనసుకు తోడు నవ్వగలను..నీకు నేనున్నాననే ధైర్యమివ్వగలను..
నేను భూమి పై ఉన్నంత వరకు ..స్నేహితునిగా చేయినందించగలను ..
కష్టాలలో ..కన్నీళ్ళలో..కనురెప్పల చూచుకొనగలను ..
నా నేస్తమా..
నా కంటి పాప నేవైనప్పుడు ...
నా కనురెప్ప..ఎండలో పంధిరై...చలిలో దుప్పటై..
ఎల్లవేళలా నిన్ను కాపాడదా .. నా నేస్తమా.. 



**//** అమ్మ,నాన్న ..ఎవరో తెలియక పోవచ్చు ..
అక్క ,చెల్లి ..అసలే ఉండక పోవచ్చు..
అన్న, తంభి .. ఊసెలేక పోవచ్చు ..
కానీ........
మిత్రుడు లేని జీవిని ఏలోకమునైన చూచారా..?
చూచానంటే ..జంతువుతో పోల్చకండి..
ఎందుకంటే ..జంతువులకు కూడా మిత్రులుంటారు కాబట్టి .. 

1 comment: