Saturday, May 8, 2010

అమ్మ

ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
||ఎవరు||
.
||చ||
అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
||ఎవరు||
.
||చ||
శ్రీరామరక్ష అంటూ నీళ్ళు పోసి పెంచింది
ధీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది ||2||
నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో
||ఎవరు||
. చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది
ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది ||2||
.
రొమ్మేగా… రొమ్మేగా అందించెను జీవితాన్ని నొటికీ
అమ్మేగా తన నెత్తురు నింపెను నీ ఒంటికి
.
ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అను రాగంలా తీయని రాగం

. ఆలైన బిడ్డలైనా ఒకరు పోతె ఇంకొకరు
అమ్మ పదవి ఖాళీ అయినా అమ్మ అవరు ఇంకెవరు ||2||
.
అమ్మంటే… అమ్మంటే విరమించని వట్టి వెట్టి చాకిరీ
అమ్మంటే రాజీనామా ఎరగని ఈ నౌకరి
.
ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అను రాగంలా తీయని రాగం


No comments:

Post a Comment