ఒక్కడై రావడం.... ఒక్కడై పోవడం....... నడుమ ఈ నాటకం .....విథిలీల వెంట ఏ బంధమూ .....రక్త సమ్బంధమూ తోడుగా రాదుగా ......తుదివేళ మరణమనేది ఖాయమనీ నీ బరువూ .....నీ పరుపూ ....మోసేదీ
ఆ నలుగురు ....ఆ నలుగురూ.... ఆ నలుగురు ....ఆ నలుగురూ....
నలుగురూ మెచ్చినా .....నలుగురూ తిట్టినా
విలువలే శిలువగా....మోశావూ అందరూ సుఖపడే .......సంఘమే కోరుతూ మందిలో మార్గమే ....వేశావూ నలుగురు నేడు పదుగురుగా పదుగురు వేలు వందలుగా నీ వెనుకే.....అనుచరులై.... నడిచారూ. ఆ నలుగురు ....ఆ నలుగురూ....
ఆ నలుగురు ....ఆ నలుగురూ....
పోయిరా నేస్తమా ....పోయిరా ప్రియతమా నీవు మా గుండెలో నిలిచావూ ఆత్మయే నిత్యమూ....జీవితం సత్యమూ చేతలే నిలుచురా.....చిరకాలం బతికినవాడు బాసటగా పోయినవాడు ఊరటగా అభిమానం...అనురాగం.....చాటేదీ. ఆ నలుగురు ....ఆ నలుగురూ....
ఆ నలుగురు ....ఆ నలుగురూ...
రాజనీ పేదనీ....మంచనీ చెడ్డనీ భేదమే ఎరుగదే యమపాశం కోట్ల ఐశ్వర్యమూ...కటిక దారిద్ర్యమూ హద్దులే చెరిపెనీ మరుభూమి మూటలలోని మూలధనం చెయదు నేడు సహగమనం నీవెంటా...కడకంటా....నడిచేదీ. ఆ నలుగురు ....ఆ నలుగురూ....
ఆ నలుగురు ....ఆ నలుగురూ.... .
No comments:
Post a Comment