Friday, October 23, 2009

ఆనందం


మిత్రులారా ఈరోజు మీకు నా దృష్టిలో ఆనందం అంటే ఎలా ఉంటుందో పంచుకోవాలి అని ఈ కొత్త పోస్ట్ రాస్తున్నాను .......
ఆనందం అంటే బ్యాంకు బాలన్స్ కాదు, ఆస్తులు కాదు , మంచి ఉద్యోగం కారు కాదు .... సింపుల్ ప్లేషర్స్ . మన కిష్టమైన పాట వినడం ఉదయం వెచ్చని నీరెండలో చేతులు కట్టుకుని 5 నిముషాలు నడవటం , మంచి పుస్తకం చదవటమ వసంత కాలంలో కోకిల గానం వినడం ఆ సంవత్సరం లో ఆ మొదటి మామిడికాయ తినడమో , పూర్తిగా విచ్చుకున్న గులాబీని కూసి మనకి పరిచయం లేని చిన్న పిల్లలకి ఇచ్చి ఆ పాప మొహం లో చిరునవ్వు చూడటమో ......"ఇలా జరిగితే ఇక మీదట నా జీవితం ఆనందంగా ఉంటుంది " అని ఏ మనిషి అనుకోకూడదు ఏదీ శాస్వత ఆనందం ఇవ్వలేదు. అనేక చిన్న సంతోషాలే జీవితాన్ని నందనవనం చేస్తాయి .
ఆనందం అంటే చక్కటి ఇల్లు , అంటే ఒక భార్య లేదా భర్తా , భార్యభర్తల అభిరుచుల కలయిక , ఒక పసిపాప పాలసీసా , నేపి మార్చడం , ప్రేమ ఇవ్వడం, తీసుకోవడం, కుటుంబ సభ్యులు కలసి భోజనం చెయ్యడం, ప్రేమతో కలసి ఉండే కుటుంబ సభ్యులు ...కురిసే వర్షపు చినుకులని నాలికతో అందుకోవడం పిల్లలు చూస్తుండగా సబ్బు నీటి తో పెద్ద బుడగ ఊదటం , గుండు గీయిన్చు కున్న పిల్లల ఫోటో చూసి వాళ్లతో పాటు నవ్వుకోవటం .....రాత్రి పూట వొంటరిగా చీకట్లో పడుకుని పాటలు వినడం .......ఇంక ,.......
ఉమ్...... జీవితం కన్నా అందమైనది , చావుకన్న భయంకరమైనది ఈ సృష్టిలో మరేది లేదు మరి అలాంటి ఆనందాన్ని
జీవితం మీద ఉత్సాహం కోల్పోవడం ఓ రకమైన ప్రీమెచూర్ డెత్ .......
ఓడిపోకుండా ఓటమిని అగీకరించటం లాంటిది జీవితాన్ని డల్ గా గడపకండి ........ తెలియజేస్తేనే గట్టిపడేది ప్ర్రేమ , కాదోషం పట్టకుండా తరచూ మాటలద్వారా , చర్యల ద్వారా ప్రేమని వ్యక్తం చేస్తుఉండాలి ..........జీవితం లో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలని మిస్కావోద్దు ఇది చదువుతున్న నా మిత్రులారా మీకు ఇలాంటి ఆనందం కలిగించే సంగటనలు ఎన్నో ఉండిఉంటై కదూ ......ఇక సెలవ మరి మల్లి కలుద్దాం ఇంకో కొత్త విషయం తో .....................

No comments:

Post a Comment