Thursday, October 22, 2009

నిస్వార్ధమైన ప్రేమ.....


ఓ సంధ్యవేళ మల్లెపూలు మాలకడుతూ........
పువ్వా పువ్వా నువ్వెందుకని రోజూ మాకోసం పూస్తుంటావు!
వికసించి పదిమందికి కనువిందు చేస్తుంటావు!
నీవు అందరికీ సువాసనలని పంచుతుంటావు!
నీకోసమంటూ నీవేముంచుకుంటావు!
అందరిని అలరించి నీవు వాడిపోతుంటావు!

నవ్వుతూ ....పువ్వు నాతో అంది.......
పిచ్చిదానా! ఇచ్చి పుచ్చుకోవడం అనేది వ్యాపార లక్షణం.
ఇచ్చి ఏమీ ఆశించకపోవడం నిస్వార్ధ ప్రేమ గుణం.
నువ్వు కూడా ఆలోచించు ఒక్క క్షణం.
కావాలంటావు అటువంటి ప్రేమ ప్రతిక్షణం.
అని అంటూ గుప్పున సువాసనలని వెదజల్లింది....

No comments:

Post a Comment