సంధ్య వెలుగులో దేవుడు కనిపిస్తే...
()
.png)
దైనందిన జీవితంలో మనకు ఎన్నో అనుభవాలు ఎదురౌతుంటాయి. ఒక్కోసారి చిత్రవిచిత్రమైన అనుభూతులకు లోనవుతుంటాం. అలాంటి అపురూపమైన అనుభవాలు, అనుభూతుల్లో దేవుడు ప్రత్యక్షం కావడం ఒకటి. సంధ్య వెలుగులో దేవుడు కనిపిస్తే ఎలా
వుంటుంది? భలే గమ్మత్తుగా ఉండదూ? కలా, నిజమా అని విస్తుపోమూ?

దేవుడు ఉన్నాడా, లేడా అన్నది ఇవాళ్టి ప్రశ్న కాదు. ఈ సందేహం తరతరాలుగా ఉన్నదే. దేవుడు ఉన్నాడని పూజలు చేసేవారితో బాటు, లేడని వాదించే నాస్తికులూ ఉన్నారు. దేవుని విశ్వసించేవారికి కలలోనో, మెలకువలోనో దేవుడు ప్రత్యక్షమావుతుంటాడు. కానీ ఇలాంటి అనుభవాలు ఎవరైనా ఇతరులతో పంచుకున్నప్పుడు, వినేవారికి సాధారణంగా నమ్మశక్యంగా ఉండవు.
ఇక్కడ చూడండి.. పీటర్ అనే పైలట్ ఓ సంధ్యా సమయంలో విమానం నడుపుతున్నాడు. మామూలుగానే చెట్లు, చేమలు, కొండలు, వాగులతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అందునా సాయంసంధ్య మరీ అందంగా ఉంటుంది. పీటర్ ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా విమానం నడుపుతున్నాడు.
ఉన్నట్టుండి పీటర్ కి ఓ చిత్రమైన దృశ్యం కనిపించింది. ఆశ్చర్యంగా కళ్ళింతలు చేసుకుని చూశాడు. ఆకాశంలో సూర్యుడు, మబ్బు తునకలు కలిసి అతనికి కనువిందు కలిగించే రూపాలను కళ్ళముందు నిలిపాయి. ఆనందంతో హృదయం పులకించింది. పీటర్ వెంటనే పక్కనున్న కెమెరా తీశాడు. అతను వృత్తిరీత్యా పైలట్ అయినప్పటికీ, ప్రవ్రుత్తి రీత్యా ఫొటోగ్రాఫర్. తనకు కనిపించిన అపురూపమైన దృశ్యాలను కెమెరాలో బంధించాడు. ఆ క్షణంలో అతని భావోద్రేకాలకు అంతులేదు.

ఇంతకీ పీటర్ కి అరుణ సంధ్యలో ఏం కనిపించిందో తెలుసా.. జీసస్ ప్రతిరూపం. కళ్ళు మిరుమిట్లు గొలిపే దేవుని రూపాలు, తనను కాపాడటానికి శరవేగంగా ముందుకు తరలివస్తున్న జీసస్ ఆకృతి స్పష్టంగా ఉన్నాయి. పీటర్ కి ఎదురైన మధురమైన అనుభవాన్ని, మనమూ అనుభూతి చెందొచ్చు. ఈ చిత్రాలను చూడండి, జీసెస్ ప్రతిరూపం ఆశ్చర్యకరంగా లేదూ?!
ఇలాంటి మిరాకిల్స్ మీకెప్పుడైనా ఎదురయ్యాయా? అయితే మాకు రాసి పంపండి.
Jesus in sunset, God appears in sunset, Peter experienced God, miracle of God in clouds
No comments:
Post a Comment