![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhBLLXwf6Mgi0w7BX1bTp4m3dGXfa8D6MxUG8wOh_QNPi2ooqluAR9YaZOwxEe8vTZ-h2tUTmm_59TZeFZPfg1HmYq1o4xgDDDuaqyp65a_lMF2xOXUf15SQTUAu3LrEtDFAgAitd9pCLKm/s400/yy.jpg)
నువ్వు నవ్వుతున్నప్పుడు
తెలియకుండానె చిరు నవ్వుతో
నా పెదవులు విచ్చుకుంటాయి
ఎంత సంతోషమో అని
తెగని ఆలోచనలతో
నువ్వు తలపట్టుకున్నప్పుడు
నేను ఆలోచిస్తాను
నువ్వేమి ఆలోచిస్తున్నావో అని
కోపంతో నువ్వు
కనులెర్ర చేసినప్పుడు
భయంతో ముడుచుకుంటాను
ఆ కోపంలో నువ్వేమవుతావో అని
ప్రశాంతంగా నువ్వు
నిద్రిస్తుంటే నాకెందుకింత
ఆనందం? ఆ తలకట్టులో
చేయిపెట్టి, నుదుటిపై ముద్దాడాలని
ఎదుకిలా జరుగుతుందని
ఎంతగానో ఆలోచించాను
ఊహుం! ఎదోతెలిసినట్లు
అంతలోనే ఏమీ తెలియనట్లు
నాకు నేనే అర్దమైనట్టు
అంతలోనే నువ్వు నేనైట్టు.
ఓ వింతైన అనుభూతి,
మాటలకందదు మనసు వీడదు
No comments:
Post a Comment