Showing posts with label telugu /culture. Show all posts
Showing posts with label telugu /culture. Show all posts

Monday, November 7, 2011

కార్తీకంలో పసందైన వనభోజనాలు



 Vanabhojanam in Karthika Masam

కార్తీకమాసం అనగానే వనభోజనాల హడావిడి మొదలౌతుందిఊరూవాడా సందడిగా ఉంటుంది.వనభోజనాల ప్రసక్తి అనేక ధార్మిక గ్రంధాల్లో ఉంది.ముఖ్యంగా ''కార్తీకపురాణం''లోకార్తీక పౌర్ణమినాడు నైమిశారణ్యంలో మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు లిఖితమైంది.ఉసిరిచెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి,ఉసిరికలతో హరిని పూజించిగోవింద నామస్మరణ చేస్తూ షోడశోపచారాలతో పూజించి ఆనక వనభోజనాలు చేశారు.

అలా పూర్వం మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాలు ఇప్పటికీ ఏర్పాటు చేసుకుంటున్నాంనలుగురితో కలిసి ఆనందిస్తున్నాంఇంతకీ కార్తీక వనభోజనాలు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం.

కార్తీకమాసం అంటే వర్షాకాలం తర్వాత వస్తుందిఅంటే అప్పటిదాకా వానలు పడి చిత్తడిగా ఉన్న భూములు పొడివారతాయిఅటు వానలుఇటు ఎండలు లేకుండా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందిఅలాంటి వాతావరణంలో నాలుగ్గోడల మధ్య కాకుండా వనంలో అందునా ఔషధ ప్రాయమైన ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది.వీలైనంతవరకూ వనభోజనాలు కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారాల్లో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమంవృత్తి ఉద్యోగాలతో కొందరికి తీరుబాటు దొరకని మాటా నిజమేఅలా కార్తీక పౌర్ణమి,కార్తీక సోమవారాల్లో వీలు కుదరని పక్షంలో కార్తీకమాసంలో ఏదో ఒక రోజు పెట్టుకోవచ్చు.
వనభోజనం పేరుతో ఇంట్లో కాకుండా ఎక్కడో ఒకచోట భోజనం చేయడం అనుకుని కొందరు హోటల్సురిసార్ట్స్ రిజర్వ్ చేయించుకుంటున్నారుఅలా చేస్తే అది వనభోజనం అనిపించుకోదు.ఏదో మార్పు కోసం సరదాగా తినడం అవుతుందిమన పెద్దలు ఉద్దేశించిన ప్రకారం కార్తీక వనభోజనానికి ఉసిరిచెట్టు ఉన్న తోట లేదా ఉద్యానవనాన్ని ఎంచుకోవాలిఅక్కడ ఉసిరిచెట్టు (A tree with acid fruit used for pickles. Phyllanthus Emblica; Emblic myrobalan ) కింద భోజనం చేయాలికార్తీక దామోదరుడు అని పిలుచుకునే శ్రీహరి విగ్రహం లేదా ప్రతిమను ఉసిరిచెట్టు కింద ఉంచిపూజ చేసిఆనక వనభోజనాలు చేయాలి.

బంధువులుస్నేహితులుసహోద్యోగులుఇరుగుపొరుగువారుఒక ఊరివారు ఇలా రకరకాలుగా కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారుఒక్కొక్కరూ ఒక్కో పదార్ధం తయారుచేసి తీసుకురావడం ఒక పద్ధతి కాగాఅందరూ తలా ఇంత అని డబ్బు చెల్లించికేటరింగ్ చెప్పడం మరో పద్ధతిమొత్తానికి మామూలు కూరలుపచ్చళ్ళతోబాటు గోంగూర పచ్చడి,ఉలవచారుపులిహోరబొబ్బట్లుగారెలుపూర్ణాలు లాంటి ప్రత్యేక వంటకాలతో ఆహా అనిపించే రుచికరమైన భోజనం చేయడం ఆనవాయితీవనభోజనానికి ముందు వెనుక రోజూవారి రొటీన్ కు భిన్నంగా అందరూ ఆటపాటలతో హాయిగాఆనందంగా గడుపుతారు.

  మనదేశంలోనే కాకుండా ప్రవాసాంధ్రులు కూడా కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకుని ఆనందిస్తున్నారు.కేవలం ఆంధ్రులే కాదు తమిళులు తదితర దక్షిణభారతీయులు వనభోజన మహోత్సవాలు జరుపుకుంటున్నారు.

కార్తీక వనభోజనాలు స్నేహాన్నిసమైక్యతను పెంపొందిస్తాయిపరస్పరం ఆహార పదార్థాలు పంచుకు తినడంవల్ల భిన్న రుచులు అనుభూతికి రావడమే కాకుండా నచ్చినవాటిని నేర్చుకోడానికి అవకాశం లభిస్తుందిదైనందిన జీవితంలో ఎదురయ్యే చిరాకులుపరాకులకు దూరంగా అందరూ కలిసి వేడుక చేసుకోవడం వల్ల వత్తిళ్ళువేదనలు తీరతాయి.వనభోజనాలను పెద్దల కంటే పిల్లలు మరీమరీ ఆనందిస్తారు.

Saturday, October 29, 2011

తెలుగువారి పండుగ నాగులచవితి




నాగుల చవితి, దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి, నాగ షష్టి కూడా నాగుల చవితి లాంటి విశేష దినాలే.

నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు.పాలతో బాటు పండ్లుఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు.

నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్నిప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు జల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి, నాగదేవతకు నమస్కరించుకుంటారు.

ఇతరుల సంగతి అలా ఉంచి, నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు.నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు.

నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రులే కాకుండా కన్నడీగులు కూడా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.

Thursday, October 14, 2010

దుష్పరిపాలనకు గోరీ




నిజాం నిరంకుశపాలన దుష్టపీడ విరగడై తెలంగాణ పోరుగడ్డ గుండెలుప్పొంగిన మరపురాని రోజిది. సరిగ్గా అరవై సంవత్సరాల క్రితం- స్వతంత్ర భారతావనిలో పరాధీనగా బావురుమంటున్న హైదరాబాద్‌ సంస్థానం విమోచన పొందిన పుణ్యదినమిది! దాస్యశృంఖలాలు తెగటారి 1947 ఆగస్టు 15న యావత్‌ భారతం సంబరాల్లో మునిగితేలుతుంటే, హైదరాబాద్‌ సంస్థానంలోని ప్రజానీకం బానిస సంకెళ్లు మరింత బిగుసుకున్నాయి. వందలాది స్వేచ్ఛాపిపాసుల కుత్తుకల్ని కర్కశంగా తెగ్గోసే దుర్మార్గాలు మరింత పెచ్చరిల్లాయి. ఈ భయవిహ్వల దుస్థితికి 1942నాటి క్రిప్స్‌ రాయబార బృందం భారత పర్యటనలోనే బీజాలు పడ్డాయి. ఇండియాకు డొమినియన్‌ ప్రతిపత్తితో స్వయంపాలన అవకాశం కల్పించదలచామని, ఏ రాష్ట్రమైనా లేదా రాజ్యమైనా భారత రాజ్యాంగంతో సంబంధం లేకుండా వేరుగా ఉండవచ్చునన్నది ఆనాటి వివాదాస్పద ప్రతిపాదన. దానిపై భగ్గుమన్న భారత జాతీయ కాంగ్రెస్‌ దేశమంతటా 'క్విట్‌ ఇండియా' ఉద్యమానికి తెరతీస్తే, భవిష్యత్తులో ఏర్పడే యూనియన్‌లో తాను చేరేది లేదని హైదరాబాద్‌ సంస్థానం ఠలాయించింది. అయిదేళ్ల దరిమిలా ఇండియన్‌ యూనియన్‌తో 'యథాతథస్థితి' ఒప్పందానికి ఈ ధోరణే ప్రేరణ. జగత్‌ ప్రళయమేదో సంభవిస్తే తప్ప తమ సామ్రాజ్యం చెక్కుచెదరదన్న దుర్భ్రమలు నిజాం పాలకుల్లో దురహంకారాన్ని పెంచి పోషించాయి. రాక్షసత్వం రాశిపోసిన కాశిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల బీభత్స దమనకాండ ఒకవైపు, పాక్‌తో బేరాలూ ఐరాసతో మంతనాల రూపేణా నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఒప్పంద ఉల్లంఘన మరోవైపు- 1948 సెప్టెంబర్లో అనివార్య పోలీసు చర్యకు దారితీశాయి. అటు తరుముకొస్తున్న సైనిక పటాలాలు, ఇటు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాఉద్యమం- నిజాం నవాబుకు దిక్కుతోచనివ్వని స్థితిలో సొంత బలగాలూ తోక ముడిచాయి. అప్పుడిక భారతప్రభుత్వం ముంగిట మోకరిల్లి, విలీనాన్ని ప్రకటించక తప్పలేదు. ఈ 'రక్తపాతరహిత విమోచన' కేవలం సైనిక చర్యవల్లనే సాధ్యపడింది కాదు. ఎందరెందరో అమరవీరుల ఆత్మ బలిదానాల ఫలశ్రుతి అది.


నైజాం నవాబును పిశాచంగా వర్ణిస్తూ పాటలల్లిన కవుల క్రోధావేశాలు- ఆనాటి పాలకుల వికృతత్వాన్ని క్రూరత్వాన్ని కళ్లకు కడతాయి. గ్రామాల్లో దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలదే సర్వం సహా పెత్తనం. నవాబు ప్రసాదంగా జాగీర్దార్లు విశేషాధికారాలతో రెచ్చిపోయేవారు. తరతరాల ప్రజాపీడనకు, భయంకర దాష్టీకాలకు, అమానుష నియంతృత్వ పోకడలకు నిజాముల పాలన పెట్టింది పేరు. నిజాం సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావాలంటూ పదునైన సంపాదకీయాలు రాసిన కలంవీరుడు షోయబుల్లా ఖాన్‌ ఉనికినే నాటి నేతలు సహించలేకపోయారు. రజాకార్ల కిరాతకాల్ని తన వ్యాసాల్లో ఎండగట్టిన నేరానికి అంతటి ప్రతిభాశాలీ దుర్మరణం పాలయ్యాడు. ఖాకీ యూనిఫాం, నల్లటోపీ, కత్తి, బాకు ధారణతో 1940లో రజాకార్‌ వ్యవస్థ ఆవిర్భవించాక అరాచకాలు ముమ్మరించాయి. నాటి నరమేధం తలచుకుని తెలంగాణ మారుమూల పల్లెలిప్పటికీ మౌనంగా రోదిస్తాయి. భాగ్యనగరంలోని నారాయణగుడా నుంచి ఫీవర్‌ ఆస్పత్రికి నడిచి వెళ్లేందుకే స్త్రీలు భయభ్రాంతులకు లోనయ్యేవారంటే, గ్రామీణుల నిస్సహాయ దురవస్థను తేలిగ్గా ఊహించుకోవచ్చు. దోపిడీలు, హత్యలు, మానభంగాలు రజాకార్ల నిత్యకృత్యాలు. అందినకాడికి దోచుకొని పంటల్ని, పల్లెల్ని తగలబెట్టేసేవారు. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడినవారి నాలుకలు తెగ్గోసేవారు. పత్రికల్లో వార్తలు రాసినవారి చేతుల్ని నరికేసేవారు. ఎన్ని వేలమంది అత్యాచారాలకు గురయ్యారో లెక్కేలేదు. దౌర్జన్య పరంపరపై ఎదురు తిరిగిన గెరిల్లా పోరాటయోధుల నెత్తుటిధారలు తెలంగాణ నేలను తడిపేశాయి. పరకాల ప్రాంతంలో విచక్షణారహిత కాల్పులు నెత్తుటేళ్లు పారించిన ఘటన, మరో జలియన్‌ వాలాబాగ్‌ దురంతాన్ని తలపిస్తుంది. అలాంటి అసంఖ్యాక వీరుల అసమాన త్యాగఫలం, తెలంగాణ విమోచనం. దానికి దర్పణంపట్టే- గొడ్డలి మన్నుకరచి గడ్డిపోచ గెలిచిందన్న దాశరథి గేయంలో ఎంతో అంతరార్థముంది. అంతకుమించిన విషాదముంది!


ప్రపంచాన్నే అబ్బురపరచిన తెలంగాణ విమోచనోద్యమానికి బాటలు వేసింది రైతాంగ సాయుధ పోరాటమే. 'నాజీలను మించిన నైజాం సర్కరోడి'పై నిప్పురవ్వలై ఎగసింది సామాన్యులే. అది ఒక్క నిజాం నవాబుకు వ్యతిరేకంగా అమాంతం చండప్రచండమై రగులుకున్న పోరాటం కానేకాదు. భూమికోసం, భుక్తికోసం, భాషకోసం, ఆత్మగౌరవంకోసం... కుల మత వర్గ భేదాలకు అతీతంగా జనసామాన్యంలో రాజుకున్న తీవ్ర నిరసన అగ్నికణమై విముక్తి ఉద్యమంగా ప్రజ్వరిల్లింది. మతంమీద, మాట్లాడే భాషమీద, మానవత్వంమీద దెబ్బతీసిన రాచరికానికి గోరీ కట్టేదాకా జనాగ్రహం ఉపశమించలేదు. వెట్టి విముక్తిని, సంస్కృతీ పరిరక్షణను, అంతకుమించి స్వేచ్ఛగా మనుగడ సాగించే హక్కును లక్షించి బాధిత ప్రజానీకం సాగించిన పోరును ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌, ఆర్యసమాజం కదం తొక్కించిన తీరు అనుపమానం. కర్రలు, బరిసెలు, కారం ముంతలు, వడిసెలతోపాటు బర్మార్లు, తుపాకులతో- నిజాం ముష్కరులు, జాగీర్దార్లు, మక్తెదార్లు, ఇనాందార్లపై నాటి కదనకాహళి... శత్రుభీకరం! రజాకార్లకు దొరక్కూడదని నాగటికర్రుతో శరీరం చీల్చుకొని ప్రాణాలు వదిలేసిన ఆత్మాభిమానధనులు ఆనాడెందరో. బైరాన్‌పల్లి లాంటి ఊళ్లలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన బిడ్డలు, సంతానాన్ని పోగొట్టుకున్న పెద్దలు, జీవిత భాగస్వామి కనుమరుగైన అభాగ్యులు... ఎందరెందరో. సంస్థానంలో హిందూ ముస్లిముల మధ్య మత విద్వేషాలు, వైషమ్యాలు సృష్టించజూసిన నిజాం పాలకుల కుయత్నాలెన్నో వీగిపోయాయి. అసమాన నెత్తుటి త్యాగాలతో పురిటిగడ్డ స్వేచ్ఛకోసం పరితపించిన అలనాటి మహాయోధుల సంబంధీకులు నేడు కడు దీనస్థితిలో బతుకులీడుస్తున్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగించిన విమోచనోద్యమం తాలూకు ఫలితాలు అట్టడుగు స్థాయికి చేరని దుర్దశ, పోరాటయోధుల దివ్యస్మృతినే మసకబారుస్తోంది. ఏ జాతికైనా సంస్కృతీ సంప్రదాయాలు, వేషభాషలే జీవగర్రలు. భూమి, భుక్తి ఆదరవులే ప్రాణాధారాలు. వాటి ఉనికిని దెబ్బతీసే ఘోర పాపాలకు ఎంతటి ఏలికలైనా మూల్యం చెల్లించి తీరాలి. తెలంగాణ విమోచనోద్యమంతో ముడివడిన వీరగాథలు ఎలుగెత్తి చాటుతున్న సందేశమిది!

Thursday, May 27, 2010

రాధామాధవం



ఎనిమిదిమంది దేవేరులకు నల్లనయ్య శ్రీవారు. పదహారువేలమంది గోపకాంతలకూ ప్రియవిభుడు. ఆ చల్లని
దేవర నామం స్మరించగానే దాని సరసన చప్పున స్ఫురించే పేరు మాత్రం రాధమ్మదే తప్ప- ముజ్జగాలనూ తన బొజ్జలో ఇముడ్చుకున్న ఆ అయ్య బరువును భక్తితో ఒకేఒక్క తులసిదళాన్ని తక్కెడలో ఉంచి తూచిన రుక్మిణిదీ కాదు; ముద్దుమురిపాల్లో, ముచ్చట్లలో తేలించి రక్తితో ఆయనను తన కొంగున కట్టుకున్న సత్యభామామణిదీ కాదు! కృష్ణస్వామి ఇంటిపేరే రాధ అన్నట్లుగా- తనను, తన సైదోడును ఈలోకం నిత్యం రాధాకృష్ణులుగానే కీర్తించేంత ఖ్యాతీ రాధాదేవి సొంతమే.'గోపజనములందు, గోపికలందును/ సకల జంతువులందు సంచరించు...' ఆ సర్వాంతర్యామి పేరుతో తన పేరు అలా పెనవేసుకుపోవడానికి ఆమె ఏ నోము నోచెనో, తపమేమి చేసెనో అనిపిస్తుంది. రాధామాధవీయం ఎప్పటికీ రమణీయమే, స్మరణీయమే. మధురానగరిలో యమునా తీరాన ఇసుకతిన్నెల మీద వెన్నెల రాత్రుల్లోన గోపికలతో నల్లని దేవుడు సాగించిన రసరమ్య రాసలీలలపై కతలెన్నో, కవితలెన్నో, కావ్యాలెన్నో, చిత్రాలెన్నో. 'నారీ నారీ నడుమ మురారి/ హరికీ హరికీ నడుమ వయారి' వలయాలు వలయాలుగా తిరుగుతూ సాగిన కేళీగోపాలం- మహనీయుల కృతుల్లోకృష్ణలీలాతరంగిణియైు ఓలలాడించింది. గీతగోవిందమై అలరించింది. వర్ణరంజిత చిత్రమై ఎదఎదలో రంగవల్లులద్దింది. స్వరలహరియైు గుండెగుండెపై పన్నీటి జల్లులు చిలకరించింది. గోవిందుడు అందరివాడే. కానీ, 'గోపాలునకెంతమంది గోపికలున్నా/ గుండెలోన నెలకొన్న రాధ ఒక్కతే'ననిపించేంతగా తన అనురాగాన్ని ఆయన రాధమ్మపైనే కురిపించాడట. ఇక రాధ- మాధవ నిలయమైన తన హృదయమే కృష్ణ ప్రేమాలయం అనిపించేంత ప్రణయరాగ సుధ!

నవరసాలలో శిఖరస్థానం శృంగారానిదే. అలాగే, భారతీయ సాహిత్యంలో- శృంగార రసాధిదేవతలైన నాయికా నాయకులుగా కవుల అగ్రతాంబూలం అందుకున్నదీ రాధాకృష్ణులే. వారి అనురాగ రాగాలే పదాలై పల్లవించి ప్రవహించిన ప్రణయభావనలు, ప్రభవించిన ప్రేమగీతాలు ఎన్నో! కృష్ణుడికి రాధ మేనత్త అనీ అంటారు. 'అల్లుడికి అత్తాశ' అనే సామెతను నిజం చేయడానికా అన్నట్లు- నోరూరించే వెన్నముద్దలు రాధత్త బుగ్గల్లా ఉన్నాయని మురిసిపోయేవాడట అల్లరి బాలకృష్ణుడు ఆ పిన్న వయసులోనే! చిన్ననాటినుంచే వారిరువురి నడుమ మరుగుగా మరుని ముచ్చట్లు చాలానే నడిచాయని ప్రతీతి. అది నిజమో, కల్పనో కానీ- రమ్యాక్షర రూపాన్ని సంతరించుకున్న ఆ మురిపాలన్నీ రసజ్ఞులకు మనోజ్ఞమైనవే. 'పచ్చకప్పురపు వాసనల తాంబూలపు మోవి రాధ మోవిపయి మోపి'న గోపాలుణ్ని శ్రీనాథ మహాకవి ప్రస్తుతిస్తే- కృష్ణుడి చెక్కిలి నొక్కి ముద్దిడిన మిటారి రాధను కవయిత్రి ముద్దుపళని తన ప్రబంధం 'రాధికా సాంత్వనం'లో చిత్రించింది. ఆ 'ముద్దు' ముచ్చట వెనక నడిచిన గ్రంథం ఎంతో ఉంది.ఇళాదేవికి, కృష్ణుడికి స్వయంగా దగ్గరుండి పెళ్లి జరిపించినది రాధాదేవే.ఆ తరవాత ఆమే- 'సొమ్ములియ్యవచ్చు, సమ్మందమియవచ్చు/ ఇయ్యరాని ప్రాణమియ్యవచ్చు/ తనదు విభుని వేరు తరుణి చేతికినిచ్చి/ తాళవశమె యెట్టిదానికైన...' అని కృష్ణుని ఎడబాటుకు ఎంతో పరితపించింది. ఇళ మోజులో పడి ఆయన తనను పట్టించుకోలేదని కోపించింది. చాలా రోజులు అత్తవారింట్లో గడిపి తిరిగివచ్చిన కృష్ణుడు- పరిపరివిధాల అనునయించి, ఆఖరికి పాదాల మీద పడిన తరవాతనే రాధిక కినుక వీడింది. కనికరించింది. అలక మానింది. ఆయనకు ముద్దును అనుగ్రహించింది. అదీ, ఆ రసవత్కావ్య ఇతివృత్తం!
భారతీయుల దృష్టిలో- అవధుల్లేని ఆరాధనకూ, అవ్యాజమైన అనురాగానికీ, అలౌకిక ప్రణయానికీ, మధుర భక్తికీ, మాధుర్యమైన రక్తికీ రాధాకృష్ణులు ప్రతీకలు. వారి అనుబంధంపై భిన్న వాదనలూ ఉన్నాయి. భాగవతం ప్రకారం- చిన్నతనాన కృష్ణుడితో ఆడుతూ, పాడుతూ గడిపిన గోపకాంతల్లో రాధ కూడా ఒక గోపిక, అంతే. ఆ తరవాతి కాలంలో జయదేవుడు రూపకల్పన చేసిన గీతగోవిందం- రాధాకృష్ణుల్ని భక్తహృదయపీఠంపై ప్రతిష్ఠించింది. కృష్ణభగవానుని ఆత్మశక్తి రాధేనన్నది వైష్ణవ మతానుయాయుల నమ్మిక. వారివురూ సహజీవనం సాగించారన్నది సత్యదూరమని కొందరి విశ్వాసం. రాధను స్వయంవరంలో కృష్ణుడు పెళ్లాడటం-చింతలపూడి ఎల్లన్న కావ్య కథావస్తువు! పురాణాల్లో ప్రక్షిప్తాలుండటం పాతకథే. స్వకపోల కల్పనా చాతుర్యం చాటుకోవడానికి కవులు పౌరాణిక పాత్రల చుట్టూ కల్పిత కథలు, గాథలు అల్లడమూ కొత్త కాదు. సహజీవనంపైనో, జీవన సాహచర్యంపైనో వాటినే ప్రామాణికంగా తీసుకోవడం తగదు. రాధాకృష్ణులు భార్యాభర్తలై మనుగడ సాగించారా, లేక పెళ్లి చేసుకోకుండా సహజీవన యాత్రను తమ జీవితపంథాగా ఎంచుకున్నారా అనే సంగతిని పక్కనపెడితే-వారూ సీతారాముల వలె, శివపార్వతుల వలె భారతీయులకు పూజనీయులే. పెళ్లికిముందు శృంగారకేళి తప్పు కాదని తీర్పునిస్తూ, ఆ సందర్భంగా 'రాధాకృష్ణులదీ సహజీవనమే కదా' అని సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇక్కడి ప్రజానీకంలో అత్యధికులకు రుచించకపోవడానికి కారణం అదే.

Tuesday, May 18, 2010

మూగజీవ భాష


- శంకరనారాయణ
జవం, జీవం ఉన్న భాషగా తెలుగు రాటుతేలడానికి మూగజీవాలను అడ్డంపెట్టుకుని మాట్లాడటమే ప్రధాన కారణమని ఎవరూ పరిశోధించకుండానే తేలిపోయింది. 'ఏమిటయ్యా! ఈ తమాషా?' అని ఎవరయినా అడిగితే- తమాషా నాది కాదు మరాఠీవాడిది అని తెలుగువాడు తిప్పి కొడతాడు. తిప్పితిప్పి కొడతాడు. జంతుతంత్రానికి పెద్దపీట వేసిన పరవస్తు చిన్నయసూరి పంచతంత్రాన్ని ఎవరు చదివినా జై కొడతాడు. తెలుగు సామెతలను నెమరువేసుకున్నా ఇదే వరస! (నెమరు వేసుకోవడాన్ని పశువులు కదా చేసేది మనుషులు కాదు కదా అన్నా తెలుగుదొర వినడు! నా'మాట' తీరు అంతేనంటాడు.) తెలుగువాడికి కోపమొస్తే ఎదుటివాణ్ని 'అడ్డమైనవాడు'అంటాడు. అడ్డమైనవాడు అంటే పశువు అని తిట్టినట్టు. ఎందుకంటే మనుషులు నిలువుగా ఉంటారు. పశువులు అడ్డంగా ఉంటాయి. ఇదీ సృష్టి రహస్యం. తెలుగువాడు తిట్టినా పొగిడినా మూగజీవాల ప్రస్తావన లేనిదే గడవదు. గాడిద చాకిరి చేస్తున్నానని తన మీద తాను సానుభూతిని ఒలకబోసుకునే తెలుగువాడు ఎదుటివాడి మీద చిందులు వేసేటప్పుడు 'గాడిద కొడకా' అని తిట్టడానికి వెనకాడడు. అంతేకాదు, 'వీడా! నా కొడుకంచు గాడిద ఏడ్చింది'అన్న మాటనూ తన నోటనే పలికిస్తాడు.'అడ్డగాడిద' అనే తెలుగువాడి తిట్టు ఇంకో భాషలో కనబడదు. దీన్ని అనువాదం చేసే మొనగాడు ఇంకా పుట్టలేదు. ఎవరైనా తనను ఇబ్బంది పెడితే 'నన్ను గాడిదను చేశావు కదయ్యా' అని నిష్ఠూరమాడతాడు. అయినదానికీ, కానిదానికీ గాడిద ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాటలంటాడు. 'నీవు పాడితే గాడిదలు వస్తా'యని సాటి గాయకుడి మనస్సును గాయపరుస్తాడు. 'సంగీతానికి నేను, సౌందర్యానికి నువ్వు' అని గాడిద ఒంటెతో అంటుందని ఎగతాళి చేస్తాడు. గాడిద మంచిది, అనదు కాబట్టి సరిపోయింది కానీ- 'నేను శ్రావ్యంగా పాడలేనంత మాత్రాన పాటలు వినడానికి రాకూడదా?' అంటే, తెలుగు నవాబు దగ్గర జవాబు లేదు. గాడిదలకు సంగీతం రాకపోయినంత మాత్రాన సాహిత్యమూ తెలియదని ఎగతాళి చేయడం అన్యాయం. 'కొండవీటిలో గాడిద నీవునుం కవివి కాదు కదా అనుమానమయ్యెడిన్‌' అని కవిసార్వభౌముడు శ్రీనాథుడు అంతటివాడు అనడం ఎంత అన్యాయం! గాడిద ఏం పాపం చేసిందని ఇన్ని మాటలు పడాలి? భారత రాజ్యాంగం ముందు మనుషులందరూ సమానమే గానీ తెలుగు భాషారాజ్యాంగంలో గుర్రమూ, గాడిదా సమానం కావు. గుర్రాన్ని గాడిదనూ ఒకే గాట ఉంచవద్దని తెలుగువాడు పదేపదే మొత్తుకుంటాడు. పేచీపెడితే గాడిదగుడ్డు అంటాడు. తనకు ఎవరైనా పాదాభివందనం చేస్తుంటే వచ్చినవాడు వసుదేవుడేమోనని 'విచారిస్తుంటాడు!' గాడిద పరిస్థితి ఇలా ఉంటే'కుక్క'చావు కుక్కది. తెలుగువాడు కుక్క విశ్వాసవంతమైన జంతువు అని ఒకపక్క పొగుడుతూ, ఇంకోపక్క 'కనకపు సింహాసమున శునకము కూర్చుండబెట్టి' అంటూ రాగాలాపన చేస్తుంటాడు. కుక్కను తంతే డబ్బులు రాలతాయని తెలిసినా సదరు అమాయక జీవిని ఏడిపిస్తుంటాడు. 'కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదగలవా?' అని సవాలు విసురుతాడు. వ్యవహారం చెడిపోతే 'కుక్కలు చింపిన విస్తరి' అయిందంటాడు. 'కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు' అని ఈసడిస్తాడు. 'కుక్క తోక వంకరలే' అని ఒక్క ముక్కలో ముక్క చీవాట్లు పెట్టినంత ఘోరంగా ముఖం పెడతాడు. కుక్కను వదలకుండా 'వరస'పెట్టి తిడతాడు. 'ఒసేయ్‌ కుక్కా అంటే ఏమిటే అక్కా'అన్నట్టు ఉందంటాడు తెలుగువాడు. 'చూస్తే చుక్క లేస్తే కుక్క' అని నఖశిఖ పర్యంతం పరిశీలించి చెబుతాడు. 'అవసరం తీరితే అక్క మొగుడు కుక్క'అంటాడు. కుక్కల్నీ విభజించి పాలిస్తాడు. 'మొరిగే కుక్క కరవదు' అంటాడు. చివరకు కుక్కల తిండినీ 'లెక్క' పెడతాడు. కూరలేని తిండి కుక్క తిండి అంటాడు. తెలుగువాడి గొడవ ఒకటి కాదు. 'నక్క జిత్తులు' అంటాడు-'పాము పగ' అంటాడు. 'నత్త నడక' అంటాడు. 'కోతి చేష్టలు' అంటాడు. భాషతో 'కోతి కొమ్మచ్చి' ఆడతాడు. గిట్టనివాడిది 'కోతి మొహం' అంటాడు. 'అసలే కోతి... కల్లు తాగింది' అని తెలుగువాడు అన్నా, వాడి మీద అభిమానంతో కోతి పరువునష్టం దావా వేయడంలేదు. ఒక్కోసారి కోతిలోనూ పరకాయ ప్రవేశం చేస్తాడు. కోతి పుండు బ్రహ్మరాక్షసి అయిందని బాధపడతాడు. నక్క బావకు ఎన్ని జిత్తులున్నా తెలుగువాడి ఎత్తుల ముందు అది చిత్తు కావలసిందే. 'నక్క ఎక్కడ నాగలోకమెక్కడ?' అని తేల్చి పారేస్తాడు. 'ఈనగాచి నక్కల పాలు చేసినట్లు' అవుతోందని అదోరకండా చూస్తాడు. 'నక్కలు బొక్కలు వెదుకును' అని పద్యం! అయినా అవి ఏం పాపం చేశాయని పద్యం పాడి మరీ దుష్ప్రచారం?

Tuesday, February 16, 2010

తల్లిదండ్రులను మరువవద్దు


అందరినీ మరచినా నీ తల్లిదండ్రులను మరువవద్దు.
వాళ్ళను మించి నీ మంచి కోరే వరవరూ ఉండరని తెలుసుకో.
నువ్వు పుట్టాలని రాళ్ళకు పూజలు చేశారు వారు.
రాయివై వారి హృదయాలను వ్రక్కలు చెయ్యవద్దు.
కొసరి కొసరి గోరుముద్దలతో నిన్ను పెంచారువారు.
నీకు అమృతమిచ్చిన వారిపైననే నువ్వు విషాన్ని విరచిమ్మ వద్దు .
ముద్దు మురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు .
ఆ ప్రేమ మూర్తుల కోరికలు నీవు నేరవేర్చాలి అని మరువవద్దు.
నువ్వెన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులకు సమానమౌతాయ ?
అంతా వ్యర్ధమే సేవాభావం లేక , గర్వం పనికిరాదు .
సంతానం వల్ల సుఖం కోరుతావు, నీ సంతాన ధర్మం మరువవద్దు.
ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరువద్దు.
నీవు తడిపిన ప్రక్కలో వారు పడుకొని నిన్నుమాత్రం పోడిపోత్తులో పడుకోబెట్టారు.
అమృతాన్ని కురిపించించే అమ్మ కళ్ళల్లో అశ్రువులను నింపకు.
నీవు నడిచే దారిన పూలు పరిచారు వారు
ఆమార్గాదర్శకులకు నేవు ముల్లువై వారిని బాధించకూడదు
డబ్బు పొతే మళ్ళి సంపాదించవచ్చు , తల్లిదండ్రులను మాత్రం మళ్లీ సంపాదించలేవు
వారి పాదాల గొప్పదనం జీవితాంతం మరువద్దు.

Tuesday, January 5, 2010

నా వూరూ... నా వారూ


భాగ్యనగర వీధులు ఎంత విశాలమో తెలియాలంటే, సంక్రాంతి పండగ రోజుల్లో చూడాలి. నిషేధాజ్ఞలు అమలుచేసినట్లు జనసంచారం బొత్తిగా లేక వీధులన్నీ బావురుమంటాయి. కిటకిటలాడే జనంతో బారులుతీరిన వాహనాలతో వాటి రొదలో కిక్కిరిసిపోయి ఉండే వీధులు- పండగ నాలుగైదు రోజులూ పిల్లలు క్రికెట్‌ ఆడుకోవడానికి వీలుగా కనపడటం ఎంతో వింతగా తోస్తుంది. రాజధానిలో సగానికిసగం జనాభా పండక్కని, బస్సుల్లోనూ రైళ్ళలోనూ కోళ్ళగంపల్లో పిల్లల్లా సర్దుకుని వారివారి ఊళ్ళకు బారులు తీరతారు. ఎందుకని ప్రజలలా పల్లెటూళ్ళకు పరుగులెడతారు? ఇక్కడ లేనిది అక్కడ ఏం ఉంది? అక్కడ పండగ ఉంది- పచ్చగా స్వాగతిస్తూ! మనుషులున్నారు- సజీవంగా శ్వాసిస్తూ! ...ఏదో గడుపుతూ కాదు- జీవిస్తూ! వారి కళ్ళల్లో వెలుగుంది... ప్రేమను ప్రకటిస్తూ! గుండెల్లో తడి ఉంది... ఆత్మీయతను కురిపిస్తూ... పల్లెటూరంటే మనిషికి తల్లిపేగు. అనునిత్యం రణగొణ ధ్వనులతో, పెనుకాలుష్యంతో ఒకరికొకరు రాసుకుంటూ ఇరుగ్గా జీవించే జనానికి- పల్లెలు విశాలంగా స్వాగతం చెబుతాయి. అడుగు పెట్టగానే- పచ్చని పరిసరాలు, పల్చని మంచుతెరలు, చల్లని పిల్లగాలి హాయిగా పలకరిస్తాయి. ఆ స్పర్శకు ప్రాణం లేచివస్తుంది. చలిపొద్దులు గంగిరెద్దులు భోగిమంటలు తలంటులు పిండివంటలు కొత్తపంటలు లేత జంటలు జడగంటలు పట్టుపరికిణీలు హరిదాసులు గొబ్బెమ్మలు బంతిపూలు భోగిపళ్ళు పేరంటాలు పాశుర పఠనాలు దాసరి కీర్తనలు పిళ్ళారి ఆరగింపులు సాతానిజియ్యర్లు రంగవల్లులు రథంముగ్గులు రిలీజు సినిమాలు కోడిపందాలు కనుమతీర్థాలు బొమ్మల కొలువులు... ఇలా ఉన్నట్టుండి తెలుపు నలుపు జీవితం అందమైన ఇంద్రధనుస్సులా వెలుగులీనుతుంది. జీవచైతన్యమేదో పురివిప్పుకొన్నట్లవుతుంది. నగర జీవితం బలవంతంగా తొడిగిన రకరకాల ముసుగులు జారిపోయి, మనిషి పసిబాలుడైపోతాడు. సహజమైన బతుకు రుచి చవిచూస్తాడు. అందుకూ- మనిషి పల్లెటూళ్ళకు పరుగెత్తేది!

నగర జీవితంలో ఇరుక్కుపోయి తాను పోగొట్టుకున్నదాన్ని వెతుక్కోవడానికి మనిషి పల్లెబాట పడతాడు. పల్లెతో పెనవేసుకుపోయిన తన బాల్యాన్ని గుండెల్లో పొదువుకునేందుకు వెళతాడు. పేర్లతోను, హోదాలతోను కాకుండా చుట్టరికాలతో పిలిచే పిలుపులను చెవులారా వినేందుకు వెళతాడు. నిజమైన ప్రేమానురాగాలకు మొహంవాచి వెళతాడు. తన మూలాలను తడుముకునేందుకు వెళతాడు. సంతలో తప్పిపోయిన లేగదూడలా అమ్మను వెతుక్కునేందుకు వెళతాడు. పల్లెల్లోకి వెళ్ళడమంటే మనిషి తనలోకి తాను ప్రవేశించడం! ...వినుము ధనములు రెండు తెరగులు... ఒకటి మట్టిని పుట్టినది... వేరొకటి హృత్‌ కమలంపు సౌరభము... అన్నాడు మహాకవి గురజాడ. నేను ఈ దేశపు పవిత్రమైన మట్టిని ప్రేమిస్తాడు వివేకానందుడు. పల్లెటూళ్ళకు పోతే తాతయ్యలు, బామ్మలు ఎదురొచ్చి బోసినోళ్ళతో విశాలంగా నవ్వి 'బాగున్నావురా' అని పలకరించినప్పుడు తెలుస్తుంది- మట్టివాసన అంటే ఏమిటో, హృదయకమల పరిమళ శోభ ఎంతటిదో! ఆ రెండు సంపదలూ పల్లెల్లోనే ఉన్నాయి. 'బాగున్నావుటే' అన్న పదం వినగానే గుండెలోతుల్లోంచి బెంగ పొగిలి కంటినీరుగా వెలువడినప్పుడు 'బతుకులో తీపి' అనే పదానికి అర్థం తెలుస్తుంది. గడవడానికీ బతకడానికీ తేడా ఏమిటో తెలియాలంటే- ఇలాంటి ఘట్టాలు అవసరం. బాగున్నావా అనేది ప్రశ్నకాదు- ఆత్మీయమైన పలకరింపు. క్షేమ సమాచారాల ఆరా. చుట్టరికాలకు దట్టమైన ఫెవికాల్‌ పూత. తరాలుగా ఈ జాతిలో స్థిరపడిన ఆపేక్షకు శబ్దమయ రూపమైన ఆ ప్రశ్నకోసం, దానిలోని ఉదాత్త మాధుర్యంకోసం, ఆ పలకరింపు సౌభాగ్యం కోరి మనిషి పల్లెకు పరుగెడతాడు.

లోగడ అయితే వీటికి పెళ్ళివేదికలు చక్కని నెలవులయ్యేవి. సందర్భాలు కుదిరేవి, సంబంధాలు కలిసేవి. పెళ్ళికి నాల్రోజులు ముందే రావడం, అందరినీ తీరిగ్గా పలకరించడం కబుర్లు కాలక్షేపాలు సరసాలు సందడులు అన్నీ తృప్తిగా ముగించుకుని మనుగుడుపుల నాటికి జనం తిరుగుప్రయాణం కట్టేవారు. అశుభకార్యాలకు సైతం నలుగురూ చేరడం, సహానుభూతి ప్రకటించడం ఉండేది. కన్నవాళ్ళను కనిపెట్టుకుని ఉండటానికే తీరికలేక వృద్ధాశ్రమాలకు తరిమేసే ఈ రోజుల్లో, అన్నేసిరోజులు కేటాయించడం అనేది ఊహించడానికే కష్టంగా ఉంది. అంతెందుకుగాని, పెళ్ళికంటూ వెళ్ళి లగ్నానికి ఉండకుండా భోంచేసేసి తిరిగొచ్చిన సందర్భాలు ఎన్నిలేవు? కనీసం మనసారా ఆశీర్వదించేందుకు, అక్షింతలు వేసేందుకు మనం ఉండటం లేదనేకదా- మూడుముళ్ళు పడకుండానే జంటను కలిపేసి సోఫాలో కూర్చోబెడుతున్నారు! పేకాటరాయుళ్ళే నయం, అక్షింతలకోసం కాసేపు విరామం పాటిస్తారు. ఈ నేపథ్యంలో తీపి పలకరింపులు... ఆపేక్షతో ఆలింగనాలు... జ్ఞాపకాలను తవ్వి పోసుకోవడం... పెళ్ళి సంబంధాలు ఆరా తీయడం... పిల్లలెక్కడున్నారో ఏం చేస్తున్నారో భోగట్టా లాగడం... వీలైతే ఒకరికొకరిని పరిచయం చేసి బాంధవ్యాలు నెలకొల్పడం... వంటివాటికి అవకాశమే లేకుండా పోతోంది. ఎవరన్నా మరణించినా- పత్రికల్లో నిలువెత్తు ప్రకటనలిచ్చి, సంతాపాలు తెలియజేయడమే సులువు మనకు. దశాహందాకా కాకపోయినా వెళ్ళి కనీసం నాలుగురోజులుండి ఓదార్చే ఓపిక, తీరిక కరవైపోయాయి. శుభానికీ కుదరక, అశుభానికీ కుదరక మనిషి విలవిల్లాడుతున్నాడు. కుదిరినా, మొక్కుబడికి వెళ్ళి రావడమే తప్ప హృదయపూర్వకంగా పాల్గొనే అవకాశం దక్కక మథనపడుతున్నాడు. అయినా గుండె 'నా' అనేవాళ్ళకోసం తపిస్తూనే ఉంటుంది. మనిషిలో ప్రవహించే రక్తం స్వభావం అది! 'నీటికన్నా నెత్తురు చిక్కన' అనే ఆంగ్లసూక్తికి అర్థమదే. రక్తంలో కలగలసిన ఆత్మీయ భావన, గుండెల్లో కెలకవేసే అపరాధ భావన రెండూ కలిసి మనిషిని పల్లెలవైపు పరుగులు తీయిస్తున్నాయంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. తప్పు జరిగాక, ...ఏమిసేతురా లింగా అనుకుంటూ తత్వాలు పాడుకోవడం తప్ప ఏం చేస్తాం!