Showing posts with label ఆణిముత్యాలు. Show all posts
Showing posts with label ఆణిముత్యాలు. Show all posts

Tuesday, March 8, 2011

గుర్తుకొచ్చింది..... ఓ మంచి పాట



పల్లవి:

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక!
ఏ దారెటుపోతుందో ఎవరినీ అడగక!

ఎవరికెవరు (1 సారి)

జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!
జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!!

చరణం :

వాన కురిసి కలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో హా

వాన కురిసి కలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో
కదలి కదలి నదులన్నీ కలిసేది కడలిలో
కదలి కదలి నదులన్నీ కలిసేది కడలిలో

కానీ ఆ కడలి కలిసేది ఎందులో ?

ఎవరికెవరు (1 సారి)
ఎవరికెవరు ఈ లోకంలో...

జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!
జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!!


చిత్రం: సిరి సిరి మువ్వ( 1978 లొ విడుదల)
సంగీతం: K.V. మహదేవన్ గారు
సాహిత్యం: వేటూరి గారు
పాడిన వారు: S.P. బాల సుబ్రమణ్యం

Saturday, February 26, 2011

చిరునవ్వుల తొలకరిలో





నిజంగానే చిరునవ్వుల తోనూ ,సిరిమల్లెల్ల తోనూ,హృదయాలు పలుకుతాయి.అతను ప్రేయసి కోసం వసంతాలు దోసిట పట్టగలడు,తారలను దీపాలు చెయ్యగలడు. ఆమె కూడా అంతే,ఉరికే సెలయేరులనూ,ఉరిమే మేఘాలనూ అతనిలోనే చూస్తుంది.






చిరునవ్వుల  తొలకరిలో 
సిరిమల్లెల చినుకులలో 
పలికేనులే హృదయాలే
పలికేనులే హృదయాలే
తొలి వలపుల కలయికలో         "చిరునవ్వుల " 

వసంతాలు దోసిట దూసి విసిరెను నీ ముంగిలిలో 
తారలనే దివ్వెలు చేసి  వెలిగింతు నీ కన్నులలో
నీవే నా జీవనాదిగా 
నీవే నా జీవనాదిగా 
ఎగసేను  గగనాల అంచులలో
విరియునులే ఆ గగనాలే నీ వెన్నెల కౌగిలిలో           "చిరునవ్వుల" 


ఉరికే  సెలయేరులన్నీ ఒదిగిపోవు నీ నడకలలో 
ఉరిమే మేఘాలన్నీ ఉలికిపడును నీ పలుకులలో 
నీవే నా పుణ్య మూర్తిగా 
నీవే నా పుణ్య మూర్తిగా 
ధ్యానింతు నా మధుర భావనలో
మెరియునులే ఆ భావనలే ఇరు మేనుల అల్లికలో       "చిరునవ్వుల" 

చిత్రం             చాణక్యచంద్రగుప్త 
రచన             సి.నారాయణ రెడ్డి 
సంగీతం         పెండ్యాల

Sunday, January 30, 2011

చినుకులా రాలి..నదులుగా సాగి.. వరదలై పోయి..కడలిగా పొంగు.. నీ ప్రేమ..నా ప్రేమ.



నమస్కారం..!
ఈ రోజు మనందరికీ ఎంతో ఎంతో ప్రియమైన, ఆనాటి ఆణిముత్యమైన ఈ పాటను గుర్తు చేస్తున్నాను.
పైన పేరు చూసి మీ అందరికీ ఈ పాట ఏంటో తెలిసిపోయే ఉంటుంది కదా..! 
సరే...ఈ పాట 1982 లో వచ్చిన నాలుగు స్తంభాలాట అనే చిత్రంలోనిది. నలుగురు వ్యక్తుల జీవితంతో విధి ఎలా నాలుగు స్తంభాలాట ఆడిందనేదే ఈ చిత్ర కథ. ఆ నలుగురు వ్యక్తులుగా నరేష్, పూర్ణిమ, ప్రదీప్, తులసి నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. ముద్ద మందారం, మల్లె పందిరి తరవాత ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది.సందర్భం వచ్చింది కాబట్టి ఆ మహానుభావుడి గురించి కొంత మాట్లాడాలనిపిస్తుంది.

జంధ్యాల గారి పూర్తి పేరు 'జంధ్యాల వీరవెంకట దుర్గాశివ సుబ్రమణ్య శాస్త్రి'.ఆయన మొదట రచయిత. ఆ తరవాతనే దర్శకులుగా మారారు. అయినా కూడా రచనే తన మొదటి ప్రేమని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు.
"నవ్వడం ఒక భోగం...నవ్వించడం ఒక యోగం...నవ్వలేకపోవడం ఒకరోగం.." అని జంధ్యా గారి డైలాగ్. ఆ మాటనే పాటిస్తూ ఆయన చివరిదాకా మనల్ని నవ్వుల్లో ముంచెత్తారు. మంచివాళ్లనెప్పుడూ దేవుడు ముందుగా తీసుకెళ్ళిపోతాడన్నట్టు... ఆయన యాభై ఏళ్ళకే మనల్ని విడిచి వెళ్ళారు. ఆయన లేని లోటు ఇంకెవరూ తీర్చలేరనేది అందరూ ఒప్పుకునే సత్యం. మళ్లీ మరో జంధ్యాల పుడితే ఎంత బావుండునో కదా... :(

సుత్తి
 అనే మాట తెలియని, ఉపయోగించని తెలుగు వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ మాట వచ్చిందే జంధ్యాల గారి ఈ నాలుగు స్తంభాలాట సినిమాలోంచి. ఈ సినిమాలోనే మన ప్రముఖ సుత్తిజంట అయిన సుత్తి వీరభద్ర రావు గారు, సుత్తివేలు గారు పరిచయమయ్యారు. మీకు గుర్తుందో లేదో కానీ... ఈ సినిమాలో సుత్తివేలు గారు సుత్తి అంటే ఏంటి? ఎన్ని రకాలు? అనే దాని మీద ఒక చిన్నపాటి ఉపన్యాసం కూడా ఇస్తారు. ఆ సుత్తే అప్పటి నుంచి ఇప్పటి దాకా మన జీవితాల్లో పెనవేసుకుపోయింది. ఎప్పటికీ ఉంటుంది కూడా...ఎందుకంటే సుత్తి వేసే వాళ్లు ఎప్పుడూ ఉంటారుగా మరి :)
ఇంక మళ్ళీ పాట విషయానికి వస్తే... సంగీతం రాజన్-నాగేంద్ర ద్వయం అందించగా సాహిత్యాన్ని వేటూరి గారు రాసారు. మీకు తెలుసో లేదో.. ఈ పాట హిందీ లో కూడా వచ్చింది. 1992 లో వచ్చిన Deewaana సినిమాలో షారుఖ్ ఖాన్, దివ్య భారతి ల మీద ఈ పాటను చిత్రీకరించారు. ऐसी दीवानगी देखी कही नही... అని సాగుతుంది ఈ పాట హిందీలో.
ఈ సినిమాలో నరేష్, పూర్ణిమ కాలేజీలో చదువుకుంటూ ప్రేమలో పడతారు. అప్పుడు వచ్చే ప్రేమగీతం ఈ పాట. ఈ పాటని బాలు, సుశీల పాడారు. పాటలో పదాలకు తగ్గట్టుగా చిత్రీకరణ ఉంటుంది. 
అచ్చ తెలుగు కుందనపు బొమ్మలా ఉండే పూర్ణిమ జంధ్యాల గారి చాలా సినిమాల్లో నటించింది. ఈ పాటలో ఒకసారి వచ్చిన వాక్యం మళ్లీ రాదు. అంటే అదే బాణిలో వేరే వేరే పదాలతో రాసారన్నమాట. ఆ గొప్పతనం వేటూరి గారికే చెల్లింది.
సరే మరి...ఒక సారి ఈ పాట సాహిత్యం చూద్దామా...

చినుకులా రాలి..నదులుగా సాగి.. 
వరదలై
 పోయి..కడలిగా పొంగు.. 
నీ ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ... 

నదివి
 నీవు..కడలి నేను.. 
మరచిపోబోకుమా
..మమత నీవే సుమా...!

చినుకులా
 రాలి..నదులుగా సాగి.. 
వరదలై
 పోయి..కడలిగా పొంగు.. 
నీ
 ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ...!

ఆకులు రాలే వేసవి గాలి.. నా ప్రేమ నిట్టూర్పులే... 
కుంకుమ
 పూసే వేకువ నీవై.. తేవాలి ఓదార్పులే... 
ప్రేమలు
 కోరే జన్మలోనే నే వేచి ఉంటానులే... 
జన్మలు
 తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే.. వెల్లువౌతానులే...! 

హిమములా
 రాలి.. సుమముల పూసి... 
ఋతు
వులై నవ్వి.. మధువులై పొంగి... 
నీ
 ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ... 
శిశిరమైనా
.. శిథిలమైనా.. విడిచిపోబోకుమా.. విరహమైపోకుమా...!

తొలకరి
 కోసం తొడిమను నేనై.. అల్లాడుతున్నానులే... 
పులకరమూదే
 పువ్వుల కోసం.. వేసారుతున్నానులే... 
నింగికి
 నెల అంటిసలాడే.. ఆ పొద్దు రావాలిలే... 
పున్నమి
 నేడై.. రేపటి నీడై.. ఆ ముద్దు తీరాలిలే.. తీరాలుచేరాలిలే... !

మౌనమై
 వెలసి.. గానమై పిలిచి... 
కలలతో
 అలసి.. గగనమై ఎగసి... 
 ప్రేమ.. నా ప్రేమ.. తారాడే మన ప్రేమ... 
భువనమైనా
.. గగనమైనా.. ప్రేమమయమే సుమా.. ప్రేమమనమే సుమా...!

చినుకులా రాలి..నదులుగా సాగి.. 
వరదలై
 పోయి..కడలిగా పొంగు.. 
నీ
 ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ... 
నదివి
 నీవు..కడలి నేను..
మరచిపోబోకుమా..మమత నీవే సుమా...!

మరి ఇంకెందుకు ఆలస్యం...ఈ పాటలోని మాధుర్యాన్ని మీరు కూడా ఆస్వాదించండి.
Chinukula Raali......

Monday, May 24, 2010

ATRIBUTES TO LEGENDARY LYRICIST VETURI SUNDARARAMA MURTHY


Get this widget | Track details | eSnips Social DNA



ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కుల్కమే లెమ్మంది

ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది
ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కుల్కమే లెమ్మంది

ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... ఇన్ని మాటలు

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

***

చిత్రం: సప్తపది (1981)
సంగీతం: K V మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: S P బాలసుబ్రమణ్యం, S జానకి

Saturday, May 8, 2010

అమ్మ

ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
||ఎవరు||
.
||చ||
అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
||ఎవరు||
.
||చ||
శ్రీరామరక్ష అంటూ నీళ్ళు పోసి పెంచింది
ధీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది ||2||
నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో
||ఎవరు||
. చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది
ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది ||2||
.
రొమ్మేగా… రొమ్మేగా అందించెను జీవితాన్ని నొటికీ
అమ్మేగా తన నెత్తురు నింపెను నీ ఒంటికి
.
ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అను రాగంలా తీయని రాగం

. ఆలైన బిడ్డలైనా ఒకరు పోతె ఇంకొకరు
అమ్మ పదవి ఖాళీ అయినా అమ్మ అవరు ఇంకెవరు ||2||
.
అమ్మంటే… అమ్మంటే విరమించని వట్టి వెట్టి చాకిరీ
అమ్మంటే రాజీనామా ఎరగని ఈ నౌకరి
.
ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అను రాగంలా తీయని రాగం


Friday, April 30, 2010

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే


పూర్తి పేరు:
వేటూరి సుందరరామ మూర్తి
పుట్టిన తేది: జనవరి ౨౯, ౧౯౩౬ (January 29, 1936)
పుట్టిన స్థలం: తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
వృత్తి: గీత రచయిత
మాతృదేవోభవ చిత్రం లోని "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" పాటకి వేటూరి గారికి నేషనల్ అవార్డు వచ్చింది, కాని తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించలేదన్న కారణంగా ఆయన ఆ అవార్డుని తిరస్కరించారు.


రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే
లోకమేన్నాడో చేకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మ
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం ||రాలిపోయే||

చెదిరింది నీ గూడు గాలిగా
చిలక గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా
మనసు మంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా
తిరిగే భూమాతవు నీవై
వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరం నీవై
ఆశలకే హారతివై ||రాలిపోయే||

అనుబంధమంటేనే అప్పులే
కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే
పగిలే ఆకాశం నీవై
జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై
తీగ తెగే వేణియవై ||రాలిపోయే||

***

చిత్రం: మాతృదేవోభవ
సంగీతం: M M కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: M M కీరవాణి

Thursday, April 29, 2010

శ్రీ శ్రీ గారి 100వ జన్మదిన సందర్భంగా...




పూర్తి పేరు: శ్రీరంగం శ్రీనివాసరావు
పుట్టిన తేది: ఏప్రిల్ 30, 1910
పుట్టిన స్థలం: విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్
మరణం: జూన్ 15, 1983
వృత్తి: కవి, గేయ రచయిత



జయభేరి - {మహా ప్రస్థానం - శ్రీ శ్రీ}

నేను సైతం
ప్రపంచాగ్ని కి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వ వ్~ఱుష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను!

నెను సైతం
భువన ఘోషకు
వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను.

ఎండ కాలం మండినప్పుడు
గబ్బిలం వలె
క్రాగి పోలేదా!
వాన కాలం ముసరి రాగా
నిలువు నిలువున
నీరు కాలేదా?
శీత కాలం కోత పెట్టగ
కొరడు కట్టీ,
ఆకలేసీ కేక లేశానే!

నే నొకణ్ణే
నిల్చిపోతే-
చండ్రగాడ్పులు, వాన మబ్బులు, మంచు సోనలు
భూమి మీదా
భుగ్న మౌతాయి!

నింగి నుండీ తొంగీ చూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు క్రక్కుకుంటూ
పేలిపోతాయి!

పగళ్ళన్నీ పగిలిపోయీ,
నిశీధాలూ విశీర్ణిల్లీ,
మహా ప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది!

నే నొక్కణ్ణి ధాత్రినిండా
నిండి పోయీ,
నా కుహూరత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహుర్తా లాగమిస్తాయి!

నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్ల రేకై పల్లవిస్తాను!
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్చనలు పోతాను!

నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!

శ్రీ శ్రీ - జూన్ 2, 1933
శ్రీ శ్రీ 'మహా ప్రస్తానం' నుంచి సంగ్రహితం

Friday, April 23, 2010

అంతులేని కథ (1976)

సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: కె.జె.ఏసుదాస్

దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటీ

దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటీ
ఇక ఊరేల సొంత ఇల్లేలా
ఇక ఊరేల సొంత ఇల్లేలా ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

నన్నడిగి తలితండ్రి కన్నారా..ఆ ఆ ఆ
నన్నడిగి తలితండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా

ఏది నీది ఏది నాది
ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ

శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మా
కళ్ళులేని కబోది చేతి దీపం నీవమ్మా

తొలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

తెలిసేట్లు చెప్పేది సిద్దాంతం
అది తెలియక పోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రమ్మా
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా

ఏది సత్యం ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ

ఆకాశమంత .. I love my Daughter






" జీవితం .. యాంత్రికంగా, వేగంగా సాగుతుంది.

మొదటి ప్రేమ .. మొదటి ముద్దు .. మొదటి గెలుపు ఇలా 30 సంవత్సరాల జీవితం లో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం !

అందులోనూ ముఖ్యమైన ఘట్టం తల్లిగానో, తండ్రిగానో మారే సమయం !
పుట్టిన బిడ్డను మొట్టమొదటి సారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం .. ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం ..

పెళ్ళికాని వాళ్ళు మీరు పుట్టినపుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి.

మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి.
ఆహా ఇదే ఇదే అని అంటారు ..."

- ప్రకాష్ రాజ్

సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: అనంత శ్రీరాం

గానం: మధు బాలకృష్ణన్

ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా .. బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా .. అమ్మరా

మేఘాల పల్లకి తెప్పిస్తా .. లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా .. చల్లనీ హాయినందిస్తా (2)

ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా .. బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా .. అమ్మరా

అడుగులే పడుతుంటే .. ఎదనిలా తడుతుంటే
మధురమౌ భావాలేవో మోగే లోలోనా ..
పలుకులే పైకొస్తే .. చిలిపిగా పిలుపిస్తే
పులకలే పదులై వేలై పొంగే నాలోనా ..

లాలిపాటే నేనై .. లాలపోసే వాణ్ణై
లాలనే నింపనా లేత హృదయానా !

మేఘాల పల్లకి తెప్పిస్తా .. లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా .. చల్లనీ హాయినందిస్తా

ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా .. బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా .. అమ్మరా

ఎగురుతూ నీ పాదం .. ఎదుగుతూ నీ రూపం
ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం
అడుగుతూ కాసేపూ .. అలుగుతూ కాసేపూ
అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం

క్షణములెన్నౌతున్నా .. వయసు ఎంతొస్తున్నా
పాపవే పాపవే నాన్న నయనానా !

మేఘాల పల్లకి తెప్పిస్తా .. లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా .. చల్లనీ హాయినందిస్తా

ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా .. బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా .. అమ్మరా
*************************************

Tuesday, April 20, 2010

బొమ్మను చేసీ.. ప్రాణము పోసీ.. ఆడేవు నీకిది వేడుకా !


ఈ పాట గురించి ఏమని చెప్పను. ఘంటసాల గారి గాత్రం తో మనసు ను మెలి పెట్టే పాట. ఆత్మీయులను కోల్పోయినపుడు గుర్తొచ్చి మరింత భాధ పెట్టే పాట. ఆపద్బాన్ధవుడు లో అడిగినట్లు "ఆ దేవుడి కి తను చేసుకున్న బొమ్మ ల పై తనకు హక్కు లేదా" అని అడుగుతున్నారా ?, మరి అలా తన ఇష్టమొచ్చినట్లు ఆడు కుందామని అనుకున్నపుడు ఆ బొమ్మల మధ్య అనుభంధాలు, మమతానురాగాలు ఎందుకు సృష్టించాలి ? ఏంటో ఈ దేవుడు !! అందుకే ఒకటి మాత్రం నిజం... తలచేది జరుగదూ... జరిగేది తెలియదూ... !!




చిత్రం: దేవత (1965)
సంగీతం : యస్.పి. కోదండపాణి
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : ఘంటసాల

బ్రతుకంత బాధ గా... కలలోని గాధ గా...
కన్నీటి ధారగా.... కరగి పోయే...
తలచేది జరుగదూ... జరిగేది తెలియదూ... !!

బొమ్మను చేసీ.. ప్రాణము పోసీ.. ఆడేవు నీకిది వేడుకా.. ||2||
గారడి చేసీ.. గుండెలు కోసీ.. నవ్వేవు ఈ వింత చాలికా...

|| బొమ్మను ||

అందాలు సృష్టించినావు.. దయతో నీవూ..
మరల నీ చేతితో నీవె తుడిచేవులే..
అందాలు సృష్టించినావు.. దయతో నీవూ..
మరల నీ చేతితో నీవె తుడిచేవులే..
దీపాలు నీవే వెలిగించినావే.. ఘాఢాంధకారాన విడిచేవులే..
కొండంత ఆశా.. ఆడియాశ చేసీ...
కొండంత ఆశా.. ఆడియాశ చేసీ.. పాతాళ లోకాన తోసేవులే..

|| బొమ్మను ||

ఒక నాటి ఉద్యానవనమూ.. నేడు కనమూ..
అదియే మరుభూమి గా నీవు మార్చేవులే..
ఒక నాటి ఉద్యానవనమూ.. నేడు కనమూ..
అదియే మరుభూమి గా నీవు మార్చేవులే..
అనురాగ మధువు అందించి నీవు.. హలా హల జ్వాల చేసేవులే
ఆనందనౌకా పయనించు వేళా..
ఆనందనౌకా పయనించు వేళా.. శోకాల సంద్రాన ముంచేవులే !!

|| బొమ్మను ||

Wednesday, April 14, 2010

ఎవరో వస్తారని ఏదో చేస్తారని

ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరచి నిదురపోకుమా

బడులే లేని పల్లెటూళ్ళలో
బడులే లేని పల్లెటూళ్ళలో
చదువే రాని పిల్లలకు
చదువు రాని చదువుల బడిలో
జీతాలు రాని పంతుళ్ళకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

చాలీ చాలని పూరి గుడిసెలో
చాలీ చాలని పూరి గుడిసెలో
కాలే కడుపుల పేదలకు
మందులు లేని ఆసుపత్రిలో
పడిగాపులు పడు రోగులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

తరతరాలుగా మూఢాచారపు
వలలో చిక్కిన వనితలకు
అజ్ఞానానికి అన్యాయానికి
బలి అయిపోయిన పడతులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

కూలి డబ్బుతో లాటరీ టికెట్
లాటరీ టికెట్
కూలి డబ్బుతో లాటరీ టికెట్
కొనే దురాశా జీవులకు
దురలవాట్లతో బాధ్యత మరిచి
చెడే నిరాశా జీవులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

సేద్యం లేని బీడు నేలలో
సేద్యం లేని బీడు నేలలో
పనులే లేని ప్రాణులకు
పగలు రేయి శ్రమ పడుతున్నా
ఫలితం దక్కని దీనులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

***

చిత్రం: భూమి కోసం
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల